Breaking
యాదాద్రి భువనగిరి:
గూడూరు టోల్ ప్లాజాలో కారు దగ్ధం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కారు దగ్ధమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్ద చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే బీబీనగర్ మండలం టోల్గేట్ వద్ద గురువారం రాత్రి 8 గంటల సమయంలో లో టోల్ ప్లాజా కు 100 మీటర్ల దూరంలో ప్రమాదవశాత్తు కారుకు ని పట్టుకుని కారు పూర్తిగా దగ్ధమైంది స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బి బి నగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్దకు ప్రయాణిస్తున్న కారు నెంబర్ AP 10 EE 3224 గల కారులోంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి దాంతో అందులో ప్రయాణిస్తున్న సుజిత్,శివ లు వాటిని గమనించి కారు నుండి బయటకు పరుగులు తీశారు.చూస్తుండగానే కారు మంటలకు ఆహుతి అయింది.సుమారు 20నిమిషాల పాటు టోల్ గేటు వద్ద ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలు ఆర్పీ వేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.