Site icon Sri Yadadri Vaibhavam

గోపాను బలోపేతం చేస్తాం. రమేష్ బాబు, బండి సాయన్నల వెల్లడి

హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న గోపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రమేష్ బాబు గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండి సాయన్న

గౌడ ఆఫిషియల్స్… వృత్తిపరమైన నైపుణ్యం సాధించడంతో పాటు రాజకీయ, సామాజిక, ఆర్థిక చైతన్యంతో ప్రగతి వైపు దూసుకు పోవాల్సిన సమయం ఆసన్నమైందని గౌడ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మద్దెల రమేష్ బాబు గౌడ్, ప్రధాన కార్యదర్శి బండి సాయన్నలు అన్నారు. శనివారం హైదరాబాదులో నిర్వహించిన గోపా రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.గోపాను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క గౌడ బంధువు సహకరించాలన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నూతన కమిటీల నియామకం తో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆక్టోబర్ రెండో వారంలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సభ్యులు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా ప్రజలు ఆశించిన మెరుగైన జీవనం పొందేందుకు సహాయపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడు అణగారిన వర్గాల ప్రజల కోసం గోపా సభ్యులు పాటు పడాలని కోరారు. .ముఖ్యంగా గౌడ కులంలో ఉన్నటువంటి ప్రతిభ ప్రతిభ కలిగిన విద్యార్థులను, ఆయా వృత్తుల్లో రాణిస్తున్న వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ మాజీ అధ్యక్షులు డాక్టర్ విజయభార్గవ్ తదితర 33 జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 26న ప్రమాణ స్వీకార కార్యక్రమం.

సాయన్నను కలిసి అభినందిస్తున్న గోపా నాయకులు భాస్కర్, వినయ్ తదితరులు…

సెప్టెంబర్ 26న గోపా 2021-22సంవత్సరానికి ఎన్నికైన నేతలచే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రకటించారు. 2021 22 సంవత్సరానికి ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున గోపా సభ్యులు హాజరు కావాలన్నారు.

Exit mobile version