2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజిక వర్గ ప్రజలకు 20వేల ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాల్టికి కనీసం రెండు ఇల్లు కూడా కట్టించలేదు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ కి ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి వుందా ? ఇందిరానగర్ లో పూర్తయిన 210ఇళ్ళని ఎందుకు పేద ప్రజలకు కేటాయించడం లేదు ? అంబేద్కర్ నగర్ 128 ఇళ్ళ నిర్మాణాలని సగంలోనే ఎందుకు ఆపేశారు ? మూడేళ్ళలో 200 ఇల్లు కూడా నిర్మించలేకపొతే 20వేల ఇళ్ళని ఎన్నేళ్ళలో నిర్మిస్తారు ?
సీఎం కేసీఆర్ ని అడగడానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ కి ధైర్యం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలి. హుజురాబాద్ మాదిరి ఉప ఎన్నిక వస్తేనైనా ఖైరతాబాద్ సమస్యలు తీరుతాయి.
ఖైరతాబాద్ అక్టోబర్ 22 శ్రీ యాదాద్రి వైభవం ప్రతినిధి
”ఖైరతాబాద్ నియోజిక వర్గం, ఇందిరా నగర్ లో నిర్మాణం పూర్తయిన 210 ఇళ్ళని పదిహేను రోజుల్లో అర్హతగల పేదలకు కేటాయించపొతే కాంగ్రెస్ పార్టీనే రిబ్బన్ కటింగ్ చేసి పేదలకు ఇళ్ళు కేటాయిస్తుంది” అని హెచ్చరించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఖైరతాబాద్ డివిజన్, ఐమాక్స్ ఎదురుగా వున్న ఇందిరా నగర్ కాలనీ, మహాభారత్ నగర్ లో ఇళ్ళ నిర్మాణాల పనులని పరీశీలించారు దాసోజు.

ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ.. ‘2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజిక వర్గ ప్రజలకు 20వేల ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాల్టికి కనీసం రెండు ఇల్లు కూడా కట్టించలేదు. స్థలం వుండి ఇల్లు కట్టుకోలేని ప్రజలకు ఆరు లక్షల రూపాయిల చొప్పన ఇస్తామని చెప్పి ఆ మాట కూడా తప్పారు. మొన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చి ప్రజలని నిలువునా మోసం చేశారు. ప్రభుత్వంపై వత్తడి పెంచి నియోజిక వర్గ ప్రజల సమస్యలని తీర్చ దమ్ములేని దానం రాజీనామా చేసి దిగిపోవాలి” అని డిమాండ్ చేశారు.
”కొత్త ఇల్లు ఇంటి నిర్మాణాలు పక్కన పెడితే కట్టి వున్న ఇళ్ళని కూడా కూడా కేటాయించడం లేదు. ఇందిరా నగర్ లో 210 ఇళ్ళని కట్టి వున్నాయి. కట్టిన ఇల్లు పాడుబడ్డ స్థితి చేరుకుంటున్నాయి. కానీ వాటిని ఎవరికీ కేటాయించడం లేదు. ఏ కారణం చేత ఇళ్ళని కేటాయించడం లేదు ? పుర్తయిన 210 ఇళ్ళని పదిహేను రోజుల్లో అర్హత గల పేదలకు కేటాయించపొతే కాంగ్రెస్ పార్టీనే రిబ్బన్ కటింగ్ చేసి పేదలకు ఇళ్ళు కేటాయిస్తుంది” అని ప్రకటించారు దాసోజు

” ఎమ్మెల్యే దానం నాగేందర్ కి ప్రజల సమస్యలు పట్టడం లేదు. అంబేద్కర్ నగర్ లో 128 ఇళ్ళ నిర్మాణాలని సగంలోనే వదిలేశారు. మూడేళ్ళలో200 ఇల్లు కూడా నిర్మించలేకపొతే 20 వేల ఇళ్ళని ఎన్నేళ్ళలో నిర్మిస్తారు. అసలు నియోజిక వర్గ ప్రజల సమస్యల పట్ల దానం నాగేందర్ కి చిత్తశుద్ధి ఉందా ? మనోడే మంచి చేస్తాడని ప్రజలు నమ్మి దానంని గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు. ప్రభుత్వం పై వత్తిడి పెంచి ఖైరతాబాద్ ప్రజల సమస్యలని పరిష్కరించే ధైర్యం ఉందా ? దానంకు ధైర్యం లేకపొతే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.

”గత ఏడేళ్ళుగా ఖైరతాబాద్ నియోజికవర్గ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్లు వుంది. అధికార పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు అమలుకాక ఖైరతాబాద్ నియోజికవర్గ అభివృద్ధి కుంటుపడింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కి కేసీఆర్ ని అడగడానికి ఏమైనా ఇబ్బందులు, బలహీతలు వుంటే మాకు సంబంధం లేదు. ఇల్లు ఇస్తామని మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వకపొతే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం చేస్తున్నారు? మీరు చేసిన మోసం వలన అనేక మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ, పేద వర్గాల ప్రజలు బాధ అనుభవిస్తున్నారు. కేసీఆర్ ని అడగడానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ కి ధైర్యం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలి.

హుజురాబాద్ మాదిరి ఉప ఎన్నిక వస్తేనైనా ఖైరతాబాద్ సమస్యలు తీరుతాయి” అని వెల్లడించారు దాసోజు.ఈ కార్యక్రమం లో Musheerabad MLA Contestant Anil Kumar yadav, khairathabad డివిజన్ అధ్యక్షులు కాటూరి రమేష్, కమ్మరి వెంకటేష్, ధనరాజ్ రాథోడ్, నరేష్, Srinivas Yadav, మాజీ కార్పొరేటర్ షరీఫ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జకీర్, అంజన్న,తాహెర్, ఫరూక్,తాజ్ ఖాన్,శ్రీనివాస్,తదితరులు పాలుగోన్నారు