లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు. పోలీసులా ? కేసీఆర్ కాపలా కుక్కలా? : ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్

0
87

”లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవు. ఉరికొయ్యలు చెరశాలలు విప్లవాన్ని ఆపలేవు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తుంటే సిఎం కేసీఆర్ పోలీసులుని ప్రయోగించిన ఎక్కడికక్కడ దుర్మార్గంగా అరెస్ట్ లు చేయిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు కేసీఆర్ కాపలా కుక్కల్లా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నియంత ధోరణిని త్వరలోనే గుణపాఠం చెబుతాం” అని హెచ్చరించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘విద్యార్ధి నిరుద్యోగ జంగ్ సైరన్’ ర్యాలీలో పాల్గొన్న దాసోజు శ్రవణ్ ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాల వేస్తుండగా పోలీసులు దాసోజు శ్రవణ్ ని బలవంతంగా వ్యాన్ ఎక్కించారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలని పోలీసులు నిర్భదించి ఎల్ బీ నగర్ స్టేషన్ కి తరలించారు.

ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. నీళ్ళు.. నిధులు.. నియామకాలు.. ఈ నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వస్తే కలలు సాకారం అవుతాయని ప్రజలు ఆశ పెట్టుకున్నారు. అయితే ఏ లక్ష్యంతో రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్యానికి తూట్లు పొడిచారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిరుద్యోగ యువత కొరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే పోలీసులని ప్రయోగించి బలవంతంగా అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు కేసీఆర్ కాపలా కుక్కల్లా వ్యవహరిస్తున్నారు. లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేవనే సంగతి కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాం. కేసీఆర్ కి కర్రుకాల్చి వాత పెడతాం”అని హెచ్చరించారు దాసోజు.