
హైదరాబాద్ వాటర్ వర్క్స్, సివరేజ్ సంస్థ కామ్‌గార్ యూనియన్ కు అద్యక్షుడిగా ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ ఎన్నిక
ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ వాటర్ సప్లై, సీవరేజ్ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదు. హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులు ఏం పాపం చేశారు ? వెంటనే హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలి
హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులకు సరైన హెల్త్ స్కీమ్ లేదు. ప్రభుత్వ వుద్యోగులకు ఇచ్చే అన్ లిమిటెడ్ హెల్త్ ఇన్సురెన్స్ హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు. ఆరు కోట్ల78లక్షల రూపాయిల ప్రీమియం కట్టించుకొని లిమిట్ కేవలామ్ 3లక్షల పెట్టారు. హెల్త్ స్కీంలో చాలా లోపాలు వున్నాయి. కేసీఆర్, మంత్రి కేటీఆర్, దాన కిశోర్ హెల్త్ పాలసీని పరిశీలించాలి.
1989 హెచ్ఎండబ్ల్యుఎస్ ప్రారంభమైనప్పటికి నుంచి నేటి వరకూ చూసుకుంటే జనాభా మూడు ఇంతలు పెరిగింది. జనాభా పెరుగుతున్నపుడు సివరేజ్ లైన్ పెరగాలి. సివరేజ్ లో పని చేసేవారికి సంఖ్యా పెరగాలి. కానీ హెచ్ఎండబ్ల్యుఎస్ లో మాత్రం సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది. ఇవాళ 1658 ఖాళీలు వున్నాయి. పది మంది పని ఒకరితో చేయిస్తున్నారు. ఈ ఏడేళ్ళ లో ఒక్క కిలో మీటర్ సివరేజ్ కూడా వేయించలేదు.
ఓపెన్ నాళలని కూడా హెచ్ఎండబ్ల్యుఎస్ పరిధిలోకి తీసుకురావాలి. ప్రజలకు మంచి సేవలు అందించడానికి, సంస్థ అభివృద్ధి కామ్‌గార్ యూనియన్ రాజీలేని పోరాటం చేస్తుంది.
”కోటి మంది హైదరాబాద్ వాసులకు నీటి సేవలు సేవలదించే సంస్థకు యునియన్ అద్యక్షుడిగా వుండటం మహత్తర బాధ్యతగా బావిస్తున్నా” అని పేర్కొన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్.
హైదరాబాద్ వాటర్ వర్క్స్, సివరేజ్ కామ్‌గార్ యూనియన్ కు అద్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు దాసోజు శ్రవణ్. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ.. వాటర్ వర్క్స్, సివరేజ్ వుద్యోగుల సేవలు వెలకట్ట లేనివి. వారు ఒక్క పూట పని ఆపస్తే నగరంలో తాగడానికి మంచి నీళ్ళు దొరకవు, ఎక్కడిక్కడ మరుగు నీరు నిలిచిపోతుంది. వారు ఆరోగ్య భద్రత కార్మికులు. అలాంటి మహత్తరమైన పని చేసే కార్మికుల జీవిత భద్రత కాపాడాల్సిన భాద్యత ఈ యునియన్ పై వుంది. అలాగే కోటి మంది ప్రజలకు కూడా సేవ చేసే అవకాశం భాద్యత వుంది. కాబట్టి యూనియన్ పాత్ర మహత్తరమైనది. ప్రజలకు సేవ చేయడానికి మంచి మార్గం” అని వెల్లడించారు దాసోజు.
”2012 లో ఈ సంఘానికి హరీష్ రావు అధ్యక్షుడిగా వున్నప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా వుండాలని నిర్ణయమైయింది. పేపర్ వర్క్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. అయితే భూమి గుండ్రంగా వున్నట్లు తొమ్మిది ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ బాధ్యత వచ్చింది. కార్మికులకు, ప్రజలకు సేవ చేయడానికి ఆ భగవంతుండే ఈ భాద్యత తనకు ఇచ్చాడని బావిస్తున్నా. సంస్థ, ఉద్యోగులని బాగా చూసుకుంటే ఉద్యోగులు సంస్థని కాపాడుకుంటారు. కాంగర్ యునియన్ కూడా ఇదే సూత్రంతో పని చేయబోతుంది. కార్మికుల సంక్షేమం చూసుకుంటూ వారి ద్వార కోట్ల మంది ప్రజలకు మంచి సేవలు అందించే దిశగా కాంగర్ యూనియన్ పని చేస్తుంది” అని పేర్కొన్నారు దాసోజు.
”హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పరిస్థితి అన్నీ వున్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా వుంది. బోర్డ్ చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి. వైస్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి. ఇంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ బోర్డ్ నిర్వీర్యమౌతుంది. దాన్ని నమ్ముకొని ఏళ్ళ తరబడి పని చేస్తున్న ఉద్యోగులు జీవితాలు చిద్రమైన పరిస్థితి నెలకొంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఉద్యోగులు, కార్మికులని ప్రత్యేకంగా కాపాడుకోవాలి. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వం పని చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ వాటర్ సప్లై, సీవరేజ్ కార్మికులకు వర్తింపచేయలేదు. హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులు ఏం పాపం చేశారు ? వారికి ఎందుకు పీఆర్సి ఇవ్వడం లేదు ? గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే హెచ్ఎండబ్ల్యుఎస్ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇచ్చారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు ? వెంటనే హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.
”హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులకు సరైన హెల్త్ స్కీమ్ లేదు. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ,సివరేజ్ కంగార్ యూనియన్ సభ్యుడు యాదగిరి అనారోగ్య స్థితిలో ఉండి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కిడ్నీ మార్పిడి కోసం ఆతని దగ్గర ముక్కు పిండి ఐదు లక్షలు వసులూ చేశారు. ప్రభుత్వ వుద్యోగులకు ఇచ్చే అన్ లిమిటెడ్ హెల్త్ ఇన్సురెన్స్ హెచ్ఎండబ్ల్యుఎస్ సభ్యుడైన యాదగిరికి ఎందుకు ఇవ్వలేదు ? హెచ్ఎండబ్ల్యుఎస్ కార్మికులు ఏం పాపం చేశారు ? పది వేల రూపాయిలు పెట్టి హెల్త్ పాలసీ కొనుక్కుంటే పది లక్షల వరకూ లిమిట్ వుంటుంది. ఐదు వేల హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులు దాదాపు ఆరు కోట్ల78లక్షల రూపాయిల ప్రీమియం కడుతున్నారు. కానీ వారికి మాత్రం ఇన్సురెన్స్ లిమిట్ మాత్రం 3లక్షల పెట్టారు. హెల్త్ స్కీంలో చాలా లోపాలు వున్నాయి. కేసీఆర్, మంత్రి కేటీఆర్, దాన కిశోర్ ఈ విషయంలో ఆలోచన చేయాలి. హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ చూపించవద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తున్నారో అలాగే హెచ్ఎండబ్ల్యుఎస్ ఉద్యోగులకు కూడా హెల్త్ పాలసీ కల్పించాలి” అని కోరారు దాసోజు.
”1989 హెచ్ఎండబ్ల్యుఎస్ ప్రారంభమైనప్పటికి నుంచి నేటి వరకూ చూసుకుంటే జనాభా మూడు ఇంతలు పెరిగింది. జనాభా పెరుగుతున్నపుడు సివరేజ్ లైన్ పెరగాలి, సివరేజ్ లో పని చేసేవారికి సంఖ్యా పెరగాలి. కానీ హెచ్ఎండబ్ల్యుఎస్ లో మాత్రం సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది. ‘1989 లో 6053మంది వుంటే ఇవాళ 5051. శ్రమ దోపిడీ జరుగుతుంది. 1658 ఖాళీలు వున్నాయి. పది మంది పని ఒకరితో చేయిస్తున్నారు. . తెలంగాణ రాకముందు 3500కిలో మీటర్ల సివరేజ్ లైన్ వుంటే.. ఈ ఏడేళ్ళ లో ఒక్క కిలో మీటర్ సివరేజ్ కూడా వేయించలేదు. అందుకే చిన్నపాటి వర్షానికి కూడా హైదరాబద్ పడవలమైపోయి నాళాలలో కొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు మంచి సేవలు అందించడానికి వెంటనే ఉద్యోగాలని భర్తీ చేసి పెండింగ్ లో వున్న అన్నీ పనులు పూర్తి చేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.
”2014లోనే మ్యానువల్ స్కావెంజింగ్ ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటికీ మ్యానువల్ స్కావెంజింగ్ జరుగుతుంది. గత నెలలో ఇద్దరు సివరేజ్ కార్మికులు మ్యానువల్ స్కావెంజింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. వారికి సరైన భద్రత లేదు. వారికి సరైన శిక్షణ ఇచ్చి అన్ని భద్రతలు కల్పించాలి. గతంలో హెచ్ఎండబ్ల్యుఎస్ వద్ద 11 సివరేజ్ క్లీనింగ్ యంత్రాలు ఉండేవి. వాటికి పక్కన పెట్టి ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్లని పట్టుకొచ్చారు. ప్రతి మిషన్ కి నెలకు రెండు లక్షలు కట్టబెట్టి ప్రైవేట్ సంస్థలని మేపుతున్న పరిస్థితి. హెచ్ఎండబ్ల్యుఎస్ ని పటిష్టం చేయడం మానేసి ప్రైవేట్ వాళ్ళని పెంచడం కోసం వ్యవస్థ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దిన్ని కూడా వెనక్కి తీసుకురావాలి. అవుట్ సోర్సింగ్ లో కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది. వారి హక్కులు కోసం కోసం పోరాడుతాం” అని వెల్లడించారు దాసోజు.
”ఓపెన్ నాళాలకి జిహెచ్ఎంసి భాద్యత వహిస్తుంది. సివరేజ్ నాళలకి హెచ్ఎండబ్ల్యుఎస్ భాద్యత తీసుకుంటుంది. ఈ రెండిటి వైరుధ్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి సంస్థ పటిష్టం కావాలంటే ఓపెన్ నాళలు కూడా హెచ్ఎండబ్ల్యుఎస్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగాలని పెంచి ఉద్యోగుల భద్రత కాపాడినట్లయితే సంస్థ బాగుపడుతుంది సంస్థలో పనిచేసే ఉద్యోగులు బాగుపడతారు కోటి మంది ప్రజలు కూడా మంచి సేవలు అందుతాయి. కామ్‌గార్ యునియన్ ఉద్యోగులకు, ప్రజలకు మహత్తర సేవలు అందించే దిశగా పని చేస్తుంది. హెచ్ఎండబ్ల్యుఎస్ సంస్థని అభివృద్ధి చేయడం కోసం రాజీ లేని పోరాటం చేస్తుంది” అని పేర్కొన్నారు దాసోజు.
ఈ సమవేశంలో హెచ్ఎండబ్ల్యుఎస్ కామ్‌గార్ యునియన్ కు చీఫ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొగుళ్ళ రాజీరెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ భూమయ్య, వైస్ ప్రెసిడెంట్ రామరాజు, ప్రధాన కార్యదర్శి సురేష్ , సీతయ్య తదితరులు పాల్గొన్నారు.