
దీపావళి సంబురాలు ప్రారంభించిన ఫౌండర్ భాస్కర్

యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ విద్యానికేతన్ రెసిడెన్షియల్ హైస్కూల్లో బుధవారం అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు దీపావళి ప్రత్యేకత వివరిస్తూ రాసిన వ్యాసాలతో కూడిన ప్రదర్శనను శ్రీ విద్యానికేతన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్ డైరెక్టర్ మాధురి లు ఆవిష్కరించారు. సరస్వతి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పుష్పాలంకరణ చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

విద్యార్థులు తయారుచేసిన దీపావళి ప్ల కార్డులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పొల్యూషన్ ను కంట్రోల్ చేస్తూ దీపావళిని జరుపుకోవాలని ఉత్సవ వైభవాన్ని వివరిస్తూ
ఎస్వీఎన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్ పిలుపునిచ్చారు. అమావాస్య రోజునే దీపావళి జరుపుకుంటామని వివరించారు.

మానవుల ఆత్మ జ్ఞానజ్యోతి ఆరిపోతున్న సమయం అమావాస్య అజ్ఞానాంధకారానికి నిదర్శనమన్నారు. ఆత్మ జ్యోతిని వెలిగించుటకై సాక్షాత్తు పరంజ్యోతి పరమశివుడు (శ్రీకృష్ణునిగా) మరియు (సత్యభామ సహాయంతో అనగా) సత్యమైన భావాలు కలిగిన మానవ ఆత్మల సహాయంతో (నరకాసుర వధ అనగా) ఆసూరి గుణాలను తొలగించడమే దీపావళిగా అభివర్ణించారు.

జ్ఞానం అనే నూనెను ప్రమిదలో పోయడం ద్వార జ్యోతిని జాగృతం చేయటం ఇలా ప్రతి ఒక్కరూ తనలోని ఆత్మ జ్యోతిని వెలిగించుకుని ఇతరుల జ్యోతిని వెలిగించడమే దీపావళి అన్నారు.




దీపాల వరుస అనగా ఆత్మ పరమాత్మ మధ్య జరిగే సంబంధాలు. పండుగ స్థూలమైన దీపాలను వెలిగించడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఆత్మలోని జ్ఞానశక్తిని స్వయం భగవంతుని యొక్క స్మృతి శక్తి ఒక పెద్ద దీపం చేత వెలిగించుకొని ఇతరులకు వెలిగించే ప్రయత్నమే ఈ సత్యమైన దీపావళి పండుగ అర్థమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఇంచార్జి జగిని హరీష్, సీనియర్ ఉపాధ్యాయులు ఎం.డి యూసుఫ్, గీత, సాహితీ, నిఖిత, సాయి, మహేశ్వరి, సరళ, తదితరులు పాల్గొన్నారు.
