గుట్ట ఎస్.వీ.ఎన్ లో అట్టహాసంగా క్యాలెండర్ ఆవిష్కరణ.ఆడి పాడిన చిన్నారులు …నాలెడ్జి మస్తీ లో ఆకట్టుకున్న విద్యార్థుల రచనలు..సాంస్కృతిక ప్రతీక ఎస్.వీ.ఎన్ అని కొనియాడిన వక్తలు

0
328

యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్ వీ ఎన్ రెసిడెన్షియల్ హైస్కూలు వారు పబ్లిష్ చేసిన తమ పాఠశాల 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లమ్ తీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, మాజీ ఎంఇఓ. ఎం. మోహనా చార్యులు, తిరుమల నర్సింగ్ హోమ్ ఎండీ డాక్టర్ ఎం.గిరిధర్, ఎస్.వీ.ఎన్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్, డైరెక్టర్ గొట్టిపర్తి మాధురీలు క్యాలెండర్ ఆవిష్కరించి క్యాలెండర్ ప్రాముఖ్యతను వివరించారు.

27 ఏళ్ల క్రితం ప్రారంభమైన పాఠశాలకు ఇంతటి ఖ్యాతిని ఆర్జించడానికి పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థుల ఉన్నత ఫలితాలు కారణమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. భాస్కర్, మాధురి దంపతులు ఎంతో ఓపికతో పాఠశాల నడుపుతున్నారని దేవస్థానం ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు చెప్పారు.

ఈ ప్రాంతంలో చక్కటి విద్యను అందించాలనే సంకల్పం నెరవేరిందని అన్నారు. సంస్కృతి, సంప్రదాయం విద్యార్థులకు అందించడం వల్ల నేడు పాఠశాల లో చదువుకున్న వారు ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారినట్లు ఉదాహారణలతో ఉప ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు వివరించారు. తమ పిల్లలంతా ఎస్.వీ.ఎన్ లోనే విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. మాజీ ఎం. ఈ. ఓ ఎం.మోహనాచార్యులు మాట్లాడుతూ పల్లెటూరు పిల్లలను సైతం అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా భోదన చేయడం వల్ల ఇతర దేశాలలో కూడా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. గ్లోబలైజేషన్ పోకడలు ముందుగానే అంది పుచ్చుకుని 2000 సంవత్సరములోనే కంప్యూటర్ విద్యను ప్రారంభించింది అని చెప్పారు.

తిరుమల నర్సింగ్ హోమ్ ఎండీ డాక్టర్ ఎం.గిరిధర్ మాట్లాడుతూ క్వాలిటీ ఎడ్యుకేషన్ కు ఎస్.వీ.ఎన్ పెట్టింది పేరని కొనియాడారు. తన పిల్లలను కూడా ఇక్కడే చదివించిన విషయాన్ని గుర్తు చేశారు. గుట్ట పరిసర ప్రాంతాలలోని విద్యార్థులకు కళాశాల విద్యను కూడా ఎస్.వీ ఎన్ లో అందించాలని. కోరారు. 27 ఏళ్ల నుంచి క్వాలిటీ విద్యను అందించడం వల్ల వేలాది మంది విద్యార్థులు బాగుపడ్డారని చెప్పారు.

విద్యారంగంలో ధృవతార గా ఎస్.వీ.ఎన్:
గొట్టిపర్తి భాస్కర్
విద్యారంగంలో ఎస్.వీ.ఎన్ దృవతారగా నిలిచిందని పాఠశాల వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ అన్నారు. 27 ఏళ్ల క్రితం పాఠశాల ప్రారంభించినప్పుడు ఉన్న ఉత్సాహమే ఇప్పుడు కూడా ఉన్నదని గుర్తుచేశారు.

ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి మాట్లాడుతూ అనతి కాలంలో నే ప్రభుత్వం నుంచి బెస్ట్ అవైలబుల్ పాఠశాల గా ఎడిగిందన్నారు.జిల్లాలో ఎస్.వీ.ఎన్ మాత్రమే గిరిజన విద్యార్థుల కు ఉచితంగా భోజన, వసతి అందిస్తుందన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
న్యూ ఇయర్ 2022 కు స్వాగతం పలుకుతూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.

నాలెడ్జ్ మస్తీ పేరిట నిర్వహించిన కవితల పోటీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఠాగూర్ ఆడిటోరియంలో వారి రచనలు ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె.హరీష్. ఎండి యూసుఫ్, జె గీత, సాహితీ, శ్రీధర్, సాయి, సరళ, మహేశ్వరి, రజిని తదితరులు పాల్గొన్నారు.