యాసంగిలో వరి పంట వద్దు…ఆరుతడి పంటలే ముద్దు: రైతులకు ఎంపీపీ చీర శ్రీశైలం పిలుపు

0
106
మాసాయిపేటలో మాట్లాడుతున్న ఎంపీపీ చీర శ్రీశైలం.

రైతులు వచ్చే యాసంగిలో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం అన్నారు. అయిన పెసర, మినుము, శనగ,జొన్న,కుసుమలు ,ప్రొద్దుతిరుగుడు పంటలు వేసుకొవడం ద్వారా లాభాలు ఆర్జించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మాసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ వారు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల ఎంపీపీ చీర శ్రీశైలం ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ రైతులు వచ్చే యాస0గీ లో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు అయిన పెసర, మినుము, శనగ, జొన్న,కుసుమలు ,ప్రొద్దుతిరుగుడు పంటలు వేసుకొవాలి అని చెప్పారు…. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జిన్నా మాధవరెడ్డి మాట్లాడుతూ వరి పంట కి బదులుగా కూరగాయలు కూడా వేసుకోవాలి అని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కంచర్ల రాజేశ్ కుమార్, కో ఆప్షన్ మెంబర్ ఎం.డి యాకుబ్, ఏఈవోలు మనీష, వెంకట్ రావు, ఉప సర్పంచి, రైతు వేదిక క్లస్టర్ లోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు మల్లారెడ్డి, బాల్ రెడ్డి, కొల లింగం, ఇంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మండల వ్యవసాయ అధికారి కంచర్ల రాజేష్ కుమార్