నల్లటి ద్రాక్షలో సి-విటమిన్, విటమిన్-ఏ, బీ6, ఫోలిక్ ఆమ్లంకూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నోరకాల ఖనిజలవణాలు ద్రాక్షలో సమృద్ధిగా ఉంటాయి.
వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి
ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. నిత్యయవ్వనులుగా ఉంచుతాయి. అంతేకాకుండా నల్లటి ద్రాక్షలు రక్తంలో నైట్రిన్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి, నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి, గుండెపోటు నివారణకు దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సౌందర్యాన్ని కూడా అందిస్తాయి
నల్లద్రాక్షలో ఉన్న పోషకాలు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు సౌందర్యాన్ని కూడా అందిస్తాయని వైద్యులు చెబుతున్నారు. నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావన్నది నిపుణుల మాట. ఈద్రాక్షలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలోని కొల్లాజిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని వాడిపోకుండా రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
మంచి పోషణనిస్తాయి
నల్లని ద్రాక్ష చర్మానికి నిగారింపు తెస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించి, చర్మానికి జీవకళను తెచ్చిపెడుతుంది. జుట్టుకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు వెంట్రుకలకు మంచి పోషణనిస్తాయి. నల్లద్రాక్ష రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది.
ఏకాగ్రత పెరుగుతుంది
అధికరక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చదువుకునే పిల్లలకు వీటిని తరుచూ తినిపిస్తూ ఉంటే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. వీటిలోని ఫైటో కెమికల్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి.
కొవ్వు పట్టకుండా
నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా నల్ల ద్రాక్ష చాలా మంచివి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపి కొవ్వు పట్టకుండా చూస్తాయి.

రక్తసరఫరా సజావుగా
మధుమేహం ఉన్నవారు ద్రాక్ష తీసుకోకూడదని చెబుతారు. కానీ నల్లద్రాక్షకు రక్తంలోని చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. అలాగే రక్తసరఫరా సజావుగా సాగేలా చేసి అధికరక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుందని చెబుతున్నారు నిపుణులు. నల్లద్రాక్షలోప్రత్యేకంగా ఉండే పాలీఫెనాల్ మైగ్రెయిన్ తలనొప్పినీ, మతిమరుపును అదుపులో ఉంచి.. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది.

కండరాలకు మేలుచేస్తాయి
నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. అలా హృద్రోగాలను దూరంచేస్తాయి. ఈ ద్రాక్షలోని పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి కూడా. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి, బరువు తగ్గించేందుకు కారణం అవుతాయి.

దివ్యౌషధంగా పనిచేస్తాయి
ఊబకాయం, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవడంలో ద్రాక్షపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండే ద్రాక్షల్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవు. పాలీఫినోల్స్‌గా పిలిచే ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అరకప్పు ద్రాక్ష
జీవక్రియలు సాఫీగా సాగేందుకు ఇవి దోహదం చేస్తాయి. బాడీలో గ్లూకోజ్ లెవల్స్‌ను స్థిరీకరించే శక్తి కూడా ద్రాక్ష పళ్లకు ఉంది. ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వచ్చిన రోజున.. అరకప్పు ద్రాక్షలు తీసుకుంటే మంచిది. ఇవి ఫాట్‌ను బర్న్ చేయడంతో పాటు కొలెస్టరాల్ లెవల్స్‌ను క్రమబద్ధీకరిస్తాయి. తద్వారా అనవసరపు ఫాట్ తగ్గుతుంది. శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది.
నెలసరి సమస్యలు దూరం
ఇక మహిళలూ.. నెలసరి సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజూ ఎండుద్రాక్షలు తినండి. ద్రాక్షపండ్లలో నలుపు, పచ్చ, పనీర్, కాశ్మీర్, ఆంక్యూర్, కాబూల్, సీడ్ లెస్ ద్రాక్షలు వంటి అనేక రకాలున్నాయి. ముఖ్యంగా మహిళలు ఎండు ద్రాక్షలు లేదా ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఆరోగ్యంగా ఉంటుంది
అలాగే గర్భిణీ మహిళలకు శక్తి కావాలంటే తప్పకుండా ఎండు ద్రాక్షలు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎండుద్రాక్షల్లో “బి” విటమిన్ ఉంది. గర్భిణీ మహిళలు ద్రాక్ష పండ్లు తీసుకుంటే గర్భస్థ శిశువుకు కావాల్సిన శక్తి లభిస్తుంది. అందుచేత గర్భిణీ మహిళలు ఎండుద్రాక్షల్ని పాలలో కలిపి వేడి చేసి తాగుతూ వస్తే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.
ఎండు ద్రాక్షల్ని నీటిలో వేసి
నెలసరి సమయాల్లో కొందరు మహిళలకు కడుపునొప్పి వస్తుంది. ఈ సమస్య ఉన్న మహిళలు ఎండు ద్రాక్షల్ని నీటిలో వేసి.. వేడిచేసి తాగితే ఉపశమనం ఉంటుంది. ఎండుద్రాక్షల్ని అలాగే తినేయడం చేయకుండా వాటిని నీటిలో కడిగి తర్వాత శుభ్రమయ్యాక తినడం మంచిది.