ఓరల్ హెల్త్ ను సరిగ్గా మెయింటెయిన్ చేయకపోతే దంత క్షయంతో పాటు చిగుళ్ల వ్యాధులు తలెత్తుతాయి. ఇవి ఇబ్బందికరంగా ఉంటాయి. అందువలన, చిగుళ్ళను అలాగే పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరి పళ్ళు షేప్ లో అలాగే సైజ్ లో విభిన్నంగా ఉంటాయి. పళ్ళు అనేవి ఆహారాన్ని నమలడానికి తోడ్పడతాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. స్మైల్ అనేది గొప్ప అసెట్. హెల్తీ స్మైల్ ను మెయింటెయిన్ చేసేందుకు ఓరల్ హైజీన్ ను పాటించడం తప్పనిసరి. ఈ ఆర్టికల్ లో మంచి ఓరల్ హైజీన్ ను ఏ విధంగా పాటించాలో వివరించడం జరిగింది. చిగుళ్ల వ్యాధి ఈ మధ్యకాలంలో సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం ప్రకారం ఇండియాలోని 95 మంది అడల్ట్స్ చిగుళ్ల వ్యాధి బారిన పడ్డారు. 50 శాతం మంది ఇండియన్స్ అసలు టూత్ బ్రష్ ని వాడటం లేదు. అలాగే 15 ఏళ్ళ వయసుకంటే తక్కువున్న 70 శాతం మంది పిల్లలు దంతక్షయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పిల్లల కోసం కొన్ని డెంటల్ కేర్ టిప్స్:
వివిధ రకాల ఆహారాలను తీసుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. అలాగే వారికి స్వీట్స్ మరియు ఫ్రూట్ జ్యూస్ లను ఎక్కువగా ఇవ్వకూడదు. హెల్తీ స్నాక్స్ ను వారి కందించండి. వారికి హెల్తీ ఫుడ్ నే అందించాలి. షుగరీ మరియు స్టార్చీ ఫుడ్స్ ను మీల్ టైంలో పిల్లలకి ఇవ్వండి. మీల్ టైంలో ఈ ఫుడ్స్ వలన పళ్ళపై దుష్ప్రభావం ఎక్కువగా పడదు.
ఓరల్ హైజీన్ ను ఈ ఆరు చిట్కాలతో పాటించండి:
1. బ్రేక్ ఫాస్ట్ కి ముందు బ్రష్ చేయండి:
బ్రేక్ ఫాస్ట్ తరువాత బ్రష్ చేయడమనేది దంతాల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తిన్న తరువాత ఏసిడ్ ఉత్పత్తి అవుతుంది. బ్రష్ చేయడం వలన ఎనామిల్ లోకి ఏసిడ్ చేరుతుంది. ఆరంజ్ జ్యూస్ వంటి షుగరీ డ్రింక్స్ ను తీసుకోవడం వలన దంతాలకు మరింత హానీ కలుగుతుంది. అందువలన బ్రేక్ ఫాస్ట్ కి ముందే బ్రష్ చేయడం వలన దంతాలపై రాత్రంతా పేరుకున్న బాక్టీరియా తొలగిపోతుంది.
2. నాలుకను పరిశుభ్రంగా ఉంచుకోండి:
మీ నోట్లోంచి దుర్వాసన వస్తోందా? అయితే, మీ నాలుక శుభ్రంగా లేదని అర్థం. నాలుకపైన బాక్టీరియా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నాలుకపైన ఆహారం మిగుళ్లు ఉండటం వలన బాక్టీరియా పేరుకుంటుంది. కాబట్టి నాలుకను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. టంగ్ స్క్రాపర్ ని వాడటం ద్వారా అలాగే టంగ్ ను బ్రష్ చేయడం ద్వారా బాక్టీరియాను నశింపచేయవచ్చు. బేకింగ్ సోడా టూత్ పేస్ట్ ను వాడటం ద్వారా నోటిలో పిహెచ్ లెవల్స్ పెరుగుతాయి. తద్వారా, నాలుకపై బాక్టీరియాను నశింపచేయవచ్చు.
3. దంతాలను ఫ్లాస్ చేసుకోండి:
పళ్ళను బ్రష్ చేయడం వలన పళ్ళ పరిసరాలలో 60 శాతం శుభ్రమవుతుంది. అయితే, బాక్టీరియల్ ప్లేగ్ అనేది పళ్ళ మధ్యలో తరచూ ఫార్మ్ అవుతూ ఉంటుంది. టూత్ బ్రష్ ద్వారా దీనిని శుభ్రపరచడం అసంభవం. ఈ ప్లేగ్ ను తొలగించేందుకు మరియు చిగుళ్ల వాపులను తగ్గించేందుకు డెంటల్ ఫ్లాస్ ను రోజూ వాడాలి. పళ్ళ మధ్యలో టైట్ స్పేస్ లను శుభ్రపరచుకోవాలి.
4. స్మూతీస్ హానికరం అవవచ్చు:
మీరు తీసుకునే ఆహారంలోని షుగర్స్ అనేవి బాక్టీరియల్ ప్లేగ్ ద్వారా మీ నోటిలో ఏసిడ్ గా మారినప్పుడు టూత్ డీకే సమస్య వేధిస్తుంది. మీల్స్ కి మధ్యలో స్మూతీస్ ను తీసుకోవడం వలన దంత సమస్యలు తలెత్తుతాయి. రోజూ స్మూతీని తీసుకోవడం ఆరోగ్యకరమే అయినప్పటికీ వాటికి షుగర్ ని జతచేయడం ద్వారా పళ్ళపై ఉండే ప్రొటెక్టివ్ ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
5. సెన్సిటివ్ టీత్ ను ఇగ్నోర్ చేయకండి:
ఈ మధ్యకాలంలో సెన్సిటివ్ టీత్ సమస్య సర్వసాధారణమైపోయింది. ఎనామిల్ దెబ్బతినడానికి ఇది ముఖ్య చిహ్నం. కొన్ని మెడికేషన్స్ ని వాడటం, ఫిజ్జీ డ్రింక్స్ ను తీసుకోవడం అలాగే వైటనింగ్ ట్రీట్మెంట్స్ వలన సెన్సిటివ్ టీత్ సమస్య వేధిస్తుంది. ఇటువంటి పెయిన్ ను మీరు నోటిస్ చేస్తే సిలికాన్ టూత్ బ్రష్ ని వాడటం మంచిది.
6. ఓరల్ హైజీన్ ను పాటించడం ఉత్తమం:
నిపుణుల సూచనల ప్రకారం చిగుళ్ల వ్యాధితో బాధపడే వారిలో దంతాలు ఆరోగ్యంగా ఉండే వారికంటే కొరోనరీ హార్ట్ డిసీజ్ బారిన పడే ప్రమాదం రెండు రెట్లు అధికం. చిగుళ్ల వ్యాధి వలన బాక్టీరియా అనేది నోటి నుంచి బ్లడ్ స్ట్రీమ్ లోకి ప్రవేశిస్తుంది. ఈ బాక్టీరియా అనేది ఒక ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటీన్ వలన గుండె సమస్యలు అధికమవుతాయి.