చర్మం కొన్ని పరిస్థితులలో అతిగా స్పందించడం మూలంగా బహుమూలలు నల్లగా మారతాయి. షేవింగ్, అధిక స్వేదం, బహుమూలాలకు గాలి సోకకుండా ఉండటం, డియోడరంట్ల వాడకం, మృతకణాలు పేరుకుపోవడం మొదలైనవి నల్లబడటానికి కారణాలు…కొన్ని సందర్భాలలో ఎకాంథోసిస్ నైగ్రికన్స్ వంటివైద్య సబంధిత పరిస్థితుల వలన ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని రకాల మందులు వాడటం వలన మరియు కేన్సర్ వలన బాహుములాలు నల్లగా మారవచ్చు.
నల్లని బాహుమూలాలు కొన్ని సార్లు మనలో చాలామందికి ఇబ్బందికరంగా అనిపిస్తాయి. దీనివలన మనం స్లీవ్ లెస్ దుస్తులు ధరించడానికి తగిన ఆత్మవిశ్వాసం కోల్పోతాము. ముందుగా ఇలా జరగడానికి గల కారణాన్ని నిర్ధారించుకుని, తదనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఒకవేళ వైద్య సబంధిత కారణాల వలన అయితే వైద్యుని సంప్రదించి తగిన మందులు వాడాలి. ఒకవేళ ఇటువంటి కారణాలేవి లేనట్లయితే, సహజ వనరులను ఉపయోగించడం అత్యుత్తమం. ఇక్కడ మీకోసం అటువంటి కొన్ని పదార్దాలను గురించిన సమాచారం అందిస్తున్నాం. వీటిని ఉపయోగిస్తే పది రోజుల లోగానే మీ బాహుబలాలు కాంతివంతంగా మారుతాయి.
నిమ్మరసం:

ముందుగా నిమ్మకాయను రెండు ముక్కలు చేయండి. ఒక ముక్కను తీసుకుని నేరుగా ఆ ప్రదేశంలో రుద్దండి. తరువాత పది నిమిషాల పాటు అలా వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడుక్కోండి. నిమ్మకాయ సహజ బ్లీచ్ గా పనిచేయడం కాక యాంటి బాక్టీరియాల్ మరియు యాంటి సేఫ్టిక్ గుణాలను కలిగి ఉంటుంది.
బేకింగ్ సోడా:

భాహుమూలలు వద్ద చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి మన ఇంట్లో లభించే బేకింగ్ సోడా మంచి పరిష్కారం. కొంచెం నీరు తీసుకుని వంట సోడాను బాగా కలిపి ముద్దగా చేయండి. ఈ ముద్దను చర్మంఫై గట్టిగా రుద్దండి. కొన్ని నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్ళతో కడిగేయండి. ఇలా క్రమంగా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
బంగాళదుంప:

బంగాళదుంప మంచి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తుంది. ఒక బంగాళదుంప ముక్కను తీసుకుని భాహుములలలో రుద్దండి. లేదంటే బంగాళదుంపను తురిమి ఆ ప్రదేశంలో పూసుకుని 10-20 నిమిషాల పేస్టును ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయండి.
తేనె:

తేనె పలు సౌందర్య సమస్యల చికిత్సలో ఉపయోగపడుతుంది. కొంచెం తేనెను తీసుకుని బాహుమూలల వద్ద పుసుకోవాలి. దీనిని పాలు,కలబంద గుజ్జు లేదా కొబ్బరినూనెతో కలిపి ఉపయోగిస్తే మరింత ప్రభావంతంగా పనిచేస్తుంది.
టొమాటో:

బాహుమూలల వద్ద ఉండే నల్లని మచ్చలను తెల్లబర్చడానికి వారానికి ఒకసారి టొమాటోను ఉపయోగించవచ్చు. టొమాటోలోని తాజా రసాన్ని పిండి, ప్రభావిత ప్రదేశాల్లో షేవింగ్ చేసుకున్నాక పూసుకోండి. ఇలా వారం రోజుల పాటు రోజుకు రెండు మూడు సార్లు చేయాలి.
దోసకాయ:

దోసకాయ అద్బుతమైన సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీనిని సురక్షితంగా బాహుమూలల వద్ద నల్ల మచ్చలను తొలగించడానికి వినియోగించవచ్చు. దోసకాయ రసాన్ని తీసుకుని దానికి కొంచెం పసుపు మరియు నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లబడిన ప్రదేశం వద్ద రాసుకోండి. కొంత సమయం తర్వాత నీటితో కడిగేయండి. ఇది ఒక్కసారి మాత్రమే కాక పలుమార్లు చేస్తూ ఉంటే ఫలితం త్వరగా కనిపిస్తుంది.
నిమ్మరసం మరియు పంచదార స్క్రబ్:

ఈ అద్బుతమైన స్క్రబ్ మీ బాహుమూలల ఛాయను తెలికపరుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పంచదార మరియు కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి మృదువుగా నల్లబడిన ప్రదేశంలో రుద్దండి. తర్వాత పది నిమిషాలు పాటు ఆగి మామూలు నీటితో కడిగేయండి.