2 నిమిషాల పాటు కడుపు దగ్గర మసాజ్ చేస్తే చాలు అజీర్తి సమస్యతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్య కడుపు ఉబ్బరం లాంటి సమస్యలను తగ్గించుకోవొచ్చు. అజీర్తి సమస్యను చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో అన్నం కూడా సరిగ్గా తినలేరు. తిన్నా కూడా తర్వాత చాలా ఇబ్బందులపడుతుంటారు. జీర్ణ సమస్య వస్తే దాంతో పాటు మీరు చాలా రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. డైజేషన్ సమస్య ఉంటే ఫ్లూ, జ్వరం, ముందుగానే నెలసరి రావడంలాంటి వంటి సమస్యల బారిన కూడా పడుతుంటారు.

అజీర్తి సమస్యతో బాధపడే అవకాశం
మీరు మానసికంగా బాధపడుతుంటే కూడా మీరు అజీర్తి సమస్యతో బాధపడే అవకాశం ఉంది. ఒత్తిడి పెరిగినప్పుడు అది మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. దీంతో మీరు చెప్పలేని బాధను అనుభవిస్తారు.

ఫాస్ట్ గా తినడం వల్ల
కొందరు తినేటప్పుడు చాలా ఫాస్ట్ గా తినడం వల్ల అది జీర్ణశయంలో గాలి పేరుకుపోయేందుకు కారణం అవుతుంది. ఆ గాలినే మనం గ్యాస్ అంటాం. అది ట్రబుల్ ఇవ్వడం వల్లే గ్యాస్ ట్రబుల్ అంటాం. అందువల్ల ఎప్పుడేగానీ తినేటప్పుడు నిదానంగా తినడం అలవాటు చేసుకోండి. మెల్లిగా ఆహారాన్ని నమిలి తినే వారు ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ సమస్య బారిన ఎక్కువగా పడరు.

ఆహారం జీర్ణం కాకుండా
జీర్ణాశయంలో కొన్ని రకాల వాయువులు ఆహారం జీర్ణం కాకుండా అడ్డుకోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. అన్నం తిన్న కాసేపటికే ఛాతీలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే గొంతులో మంట ఏర్పడుతుంంది. పుల్లటి తేన్పులు కూడా వస్తాయి. ఇలా రకరకాలుగా ఇబ్బందులుపడతారు. అయితే ఇలాంటి సమస్య తాత్కాలికమని కొందరు లైట్ గా తీసుకుంటారు.
కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. భవిష్యత్తులో జీర్ణకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే నిర్లక్ష్యం చేయకండి.

కడుపులో అదోలా అనిపించినా
కడుపు ఉబ్బరంగా ఉన్నా, కడుపులో అదోలా అనిపించినా, ఛాతీలో మంటగా అనిపించినా, తేన్పులు ఎక్కువగా వచ్చినా అలాగే అపాన వాయువు ఎక్కువగా బయటకు రావడంలాంటివన్నీ సమస్యలే. ఇలాంటి సమ్యలన్నింటికీ రెండు నిమిషాల పాటు కడపుపై మర్దన చేసుకుంటే చాలు. మరి ఈ మసాజ్ ఎలా చేసుకోవాలో చూడండి.

కడుపు దగ్గర మసాజ్ ఎలా చేయాలి
– ముందుగా మీరు నేలపై వెల్లకిలా పడుకోవాలి. కింద యోగా చేసుకునేందుకు వేసుకునే మార్ట్ వేసుకోండి. – మోకాలిని వంచి పైకి లేపాలి. పాదాలను మాత్రం కింద ప్లోర్ కు సమాంతరంగా చాచి ఉంచాలి. -ఇప్పుడు, మీ కడుపుపై మీ రెండు చేతులు పెట్టుకుని రౌండ్ గా రుద్దండి. గడియారంలో ముల్లు ఎలా అయితే తిరుగుతుందో అలా మీ చేతులతో రౌండ్ గా కడుపుగా మర్దన చేసుకోవాలి.

నీళ్లు బాగా తాగాలి
– మసాజ్ చేసుకుంటున్నప్పుడు శ్వాసను పీల్చుకుంటూ ఉండండి. – మీకు రిలాక్స్ గా అనిపించే వరకు అలా చేసుకుంటూ ఉండండి. కొద్ది సేపట్లోనే మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. – అజీర్తి, గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడే వారు రోజూ నీళ్లు బాగా తాగాలి. ప్రతిరోజు 6 గ్లాసుల వరకు నీళ్లు తాగాలి. ఇలా చేస్తే మీరు కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు.