భారతదేశంలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువ అన్న విషయం మీకు తెలుసా? ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం, ప్రతి మూడవ వ్యక్తి భారత్ లో ఏదో ఒక థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్య ఇదివరకు జన్యుపరంగా వచ్చేది. ఇప్పుడు వాతావరణ కారణాలు,ఆహారం, జీవనవిధానం కూడా ఈ సమస్యలు కలిగిస్తున్నాయి. పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కన్నా ఎక్కువ మంది అయోడిన్ లోపంతో బాధపడుతున్నారని కనుక్కొన్నారు. నిజానికి, స్త్రీలలో అయోడిన్ లోపం, థైరాయిడ్ సమస్యలు మగవారిలోకన్నా ఎక్కువ ఉంటాయి. నివేదికల ప్రకారం ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు తమ జీవితంలో తప్పక వీటిని ఎదుర్కోంటారు. ఈ ఆర్టికల్ లో మనం స్త్రీలలో థైరాయిడ్ సమస్యలను ఎలా నివారించవచ్చో పద్ధతులను చర్చిద్దాం. అయితే, ఈ థైరాయిడ్ సమస్యల లక్షణాలు ఏమిటి? ఆందోళన, బుద్ధి మందగించటం, ఏకాగ్రత లేకపోవటం, నెలసరి మార్పులు, ఉబ్బరం, గుండెవేగం పెరగటం, బరువు పెరగటం, ఒళ్ళునొప్పులు, వేడి తట్టుకోలేకపోవటం, ఎక్కువ కొలెస్ట్రాల్ స్థాయి, చలిగా ఉండటం వంటివి. మగవారిలో థైరాయిడ్ సమస్య లక్షణాలు అలసట, డిప్రెషన్,బరువు పెరగటం, జుట్టు ఊడిపోవటం, బుద్ధి మందగించటం, మలబద్ధకం, నిద్రలేమి, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవటం, అంగస్థంభన వంటివి. స్త్రీలలో థైరాయిడ్ సమస్యలను నివారించే కొన్ని పద్ధతులు :
1.మానసిక వత్తిడి తగ్గించుకోవాలి:

ఆడవాళ్ళు మానసిక వత్తిడిని తగ్గించుకోవాలి, లేకపోతే మానసిక వత్తిడి వలన హార్మోన్ల అసమతుల్యత వస్తుంది. సాధారణంగా మానసిక వత్తిడి ఆడవారిలో ఉండటం వలన థైరాయిడ్ సమస్యలు కూడా వారికే ఎక్కువ వస్తాయి. థైరాయిడ్ గ్రంథిపై మానసిక వత్తిడి ఎలా ప్రభావం చూపిస్తుంది? మానసిక వత్తిడి ఆగకుండా ఉంటే అది థైరాయిడ్ గ్రంథులను పాడుచేస్తుంది. అందుకని స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు.
2.ప్రేగుల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:

గ్లూటెన్ ఆహారపదార్థాలు, చక్కెర, పాలఉత్పత్తులు, స్వీట్లు,ఆల్కహాల్ ఇవన్నీ శరీరంలో వాపును పెంచుతాయి కాబట్టి దూరంగా ఉండాలి. పీచు ఎక్కువున్న పండ్లు, కాయగూరలు,చిక్కుళ్ళు మంచి ప్రీబయాటిక్స్ గా పనిచేసి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రేగుల్లో పెంచుతాయి. మీ ఆహారంలో తెల్ల బీన్స్ ను తీసుకోండి, ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, థైరాయిడ్ పనిచేయటానికి ఇది అవసరం.
3.వాపును తగ్గిస్తుంది:

నూనెచేపలైన మాకెరెల్ లేదా సాల్మన్ స్వభావసిద్ధంగా వాపులేకుండా ఉంటాయి. మీరు మంచి నాణ్యతకల చేపలను తినవచ్చు ఇంకా తాజా పసుపును మరిగించిన పాలలో లేదా మీ స్మూతీలలో జతచేసుకోవచ్చు. పాలకూర, నిమ్మ,దోస,కొత్తిమీరలతో తయారుచేసిన ఆకుపచ్చని స్మూతీని తాగవచ్చు.
4.విటమిన్ డి తీసుకోవటం ఎక్కువ చేయండి:

విటమిన్ డి సరైన స్థాయిల్లో తీసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే తక్కువ స్థాయిలో ఉన్న విటమిన్ డి వలన థైరాయిడ్ రావచ్చు. విటమిన్ డి వాపుకి వ్యతిరేకంగా పనిచేసి, ఆటోఇమ్యూన్ వ్యాధి రాకుండా చేస్తుంది. రోజుకి 1000 నుంచి 5000 ఐయూల విటమిన్ డి తీసుకోవాలి.
5.ఐయోడిన్ సరిగా తీసుకునేలా చూడండి:

థైరాయిడ్ సమస్యలున్నప్పుడు ఐయోడిన్ ఎంత తీసుకుంటున్నారో క్రమబద్ధంగా తెలుసుకోవటం అవసరం. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ థైరాక్సిన్ ఉత్పత్తి కావటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇంకా అతిగా అయోడిన్ తీసుకోవద్దు లేకపోతే హైపర్ థైరాయిడిజంకి దారితీస్తుంది. ఇక్కడ మీ క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా చెక్ చేసుకోండి! ఇక్కడ మీ క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా చెక్ చేసుకోండి! సరిపోల్చండి&ఉత్తమ టర్మ్ ప్లాన్ ను నేడే కొనండి. కవర్ కరో, కామ్ ఆయేగా!
6.మీరు ప్రొటీన్ సరిగ్గా తీసుకోండి:

ప్రొటీన్ అవసరమైనది, ముఖ్యమైనది. ఇది థైరాయిడ్ హార్మోన్ ను అన్ని కణజాలాలకి రవాణా చేస్తుంది, దీనివలన థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేస్తుంది. మీ డైట్లో ప్రొటీన్ ఎక్కువవుండే పదార్థాలైన గుడ్లు, సీడ్స్,నట్లు,చేపలు,పీచుపదార్థాలు చేర్చుకోవచ్చు. సోయా ఉత్పత్తులైన టోఫూ, సోయాపాలు,సోయాగింజలు మంచి ప్రొటీన్ వనరుగా ఉపయోగపడతాయి.
7.పొగతాగడం ఆపేయండి:

మీకు సిగరెట్ పొగలో థైరాయిడ్ గ్రంథులకి అపాయకరమైన వివిధ విషాలుంటాయని తెలిసుండకపోవచ్చు, అవి థైరాయిడ్ వ్యాధిని వచ్చేలా చేయగలవు. తరచుగా పొగ తాగేవారు గ్రేవ్స్ వ్యాధికి చెందిన థైరాయిడ్ కంటి సమస్యలు పొందుతారు. వీటికి చికిత్స ఎక్కువ ప్రభావం చూపించదు కూడా.