మనదేశంలో ఏడాదికి 74,000 మరణాలు క్యాన్సర్ వలనే అని నమోదు అవుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్ కి ముఖ్య కారణం హెచ్ పివి.హ్యూమన్ పాపిలోమావైరస్ లేదా మామూలు భాషలో హెచ్ పివి గర్భాశయ క్యాన్సర్ వెనుక ఉన్న ముఖ్య కారణం. హెచ్ పివి ఇన్ఫెక్షన్ కి ముఖ్య కారణం యోని,యానల్ లేదా ఓరల్ సెక్స్. భారతీయ స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ముందుగా ఉన్నదని తెలుసా మీకు?భారతదేశంలో 15ఏళ్ళ వయస్సు పైబడిన ఆడవాళ్ళలో మొత్తం 365.71 మిలియన్ల మందికి గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది ప్రజలకి హెచ్ పివి ఇన్ఫెక్షన్ సోకుతోంది. హెచ్ పివి ఇన్ఫెక్షన్ లక్షణాలు నోరు, జననాంగాలు లేదా గొంతు వద్ద పులిపిర్లు రావటం. హెచ్ పివి ఇన్ఫెక్షన్ ను నయం చేయటానికి, మరింత వ్యాప్తి చెందకుండా చూడటానికి చాలా టాబ్లెట్లు దొరుకుతాయి. కానీ అదృష్టవశాత్తూ, హెచ్ పివి ఇన్ఫెక్షన్లను నయం చేయటానికి కొన్ని సహజ పద్ధతులు కూడా ఉన్నాయి. అలా స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గిస్తాయి. అందుకని, హెచ్ పివి ని సహజంగా, అలా గర్భాశయ క్యాన్సర్ ను రాకుండా చూసే సహజ పద్ధతులేంటో కింద చదివి తెలుసుకోండి.
1.కాయగూరలు :
గుమ్మడికాయ, టమాటాలు, లెట్యూస్,చిలకడదుంపల వంటి కాయగూరలలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండి శరీరంలో ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. బీటా కెరోటిన్ రెటినాల్ గా శరీరంలో మారి (ముఖ్యమైన ఒక విటమిన్) రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చి, అలా హెచ్ పివి ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయపడుతుంది.
2.అల్లం :
అల్లం భారతీయ వంటిళ్ళలో దొరికే సులభమైన మొక్క. ఇది చాలా శక్తివంతమైన మొక్క,వైద్యపరంగా, వంటకాల రుచులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా శరీరంలో హెచ్ పివి ఇన్ఫెక్షన్ ను తొలగించటంలో సహజచిట్కాగా పనిచేస్తుంది. మీరు అల్లాన్ని నేరుగా వంటకాలలో కలిపి తీసుకోవచ్చు లేదా అల్లంటీలా తీసుకోవచ్చు.
3.పసుపు :
మనందరం పసుపు వాడతాం, కానీ మీకు అందులో ఉండే పదార్థం ఒకటి హెచ్ పివి ఇన్ఫెక్షన్ కి అద్భుతంగా పనిచేస్తుందని తెలుసా? సర్క్యుమిన్ పసుపులో ఉంటుంది, ఇది శరీరాన్ని హానికరమైన హెచ్ పివి ఇన్ఫెక్షన్ నుంచి సహజంగా కాపాడుతుంది. ఇది ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ నయమవ్వటంలో కూడా సాయపడుతుంది.
4.మష్రూమ్ :
మష్రూమ్స్ ఆరోగ్యకరమేకాక, పోషకాలతో నిండి వుండి శరీరానికి చాలా మంచి చేస్తాయి. కొన్నిరకాల మష్రూమ్స్, షిటేక్ వంటివి హెచ్ పివి ఇన్ఫెక్షన్ ను సహజంగా తగ్గించటంలో సాయపడుతుంది. ఈ మష్రూమ్స్ లో యాంటీ వైరల్ లక్షణాలు శరీరంలో హెచ్ పివిను చంపేసేలా చేస్తాయి. ఇవి జననాంగాల దగ్గర పులిపిర్ల నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి.
5.వెల్లుల్లి :
దీని ఘాటైన రుచి,వాసన వలన వెల్లుల్లి భారతీయ వంటకాలలో ప్రసిద్ధి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ శరీరాన్ని హానికరమైన సూక్ష్మజీవులనుంచి కాపాడేలా సాయపడుతుంది. ఇది హెచ్ పివి వలన వచ్చే పులిపిర్ల నుండి ఉపశమనం కూడా ఇస్తుంది.