అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన వర్టుర్…పూజలో ఆడి పాడిన కాంగ్రెస్ ఇంచార్జి బీర్ల అయిలయ్య

0
79

మోటకొండూరు మండలం లోని వడ్లూరు గ్రామంలో చౌడే రాజశేఖర్ నివాసంలో అయ్యప్ప మహా పడిపూజ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పడిపూజ కార్యక్రమం వేలాది మందిని ఆకర్షించింది. భక్తులు తన్మయత్వంతో అయ్యప్ప అయ్యప్పను కొలుస్తూ భజనలు చేశారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య ఈ సందర్భంగా పాల్గొని ప్రసంగించారు.

ఆధ్యాత్మిక ఆలంబనకు అయ్యప్ప మాల ధారణ దోహదపడుతుందని చెప్పారు. అయ్యప్పను నమ్మినవారికి సర్వ శుభాలు కలుగుతాయని చెప్పారు ఈ సందర్భంగా రాజశేఖర్ ఐలయ్యను ఘనంగా సన్మానించారు.

అయిలన్నను సన్మానిస్తున్న రాజశేఖర్