Site icon Sri Yadadri Vaibhavam

డాక్టర్ బలరాం ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ ఆదరణ…భారీగా తరలి వచ్చిన రోగులు

ఉప్పల్ డిపో వద్ద గల పిల్లర్ నంబర్ 79 వద్ద గల ఈబీఆర్ మెడికల్ సెంటర్

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శనివారం ఉప్పల్ డిపో పిల్లర్ నంబర్ 79 వద్ద గల తమ మెడికల్ సెంటర్ లో డాక్టర్ బలరాం, డాక్టర్ అనురాధల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. మధుమేహగ్రస్తులు, పలు ఇతర రోగాలతో బాధపడుతున్న రోగులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వచ్చినవారికి వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. అనంతరం జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బలరాం, గైనకాలజిస్టు డాక్టర్ అనురాధ రోగులను పరీక్షించారు. వారికి కావలసిన సూచనలు సలహాలు అందజేశారు.

.మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ బలరాం.

ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బలరాం మాట్లాడుతూ ఉప్పల్ డిపో సమీపంలోని పిల్లర్ పిల్లర్ నెంబర్ 79 ఎదురుగా గల తమ ఈబీఆర్ మెడికల్ సెంటర్ లో అన్ని రోగాలకు వైద్య చికిత్స నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా సంబంధిత రోగాలకు ఖచ్చితమైన వైద్యం ఉంటుందని ఆయన వివరించారు.

రోగుల సేవలో ఈబీఆర్ దవాఖాన సిబ్బంది…
వేచి ఉన్న రోగులు

బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రోగులు తమకు గల వ్యాధులతో అధైర్యపడకుండా క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని నాణ్యమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు బలరాం చెప్పారు. గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ స్త్రీల సంబంధిత వైద్య చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. భువనగిరి పట్టణంలో ఏరియా ఆసుపత్రి సమీపంలో ఈబీఆర్ నర్సింగ్ హోమ్ గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నట్లు అనురాధ చెప్పారు.

రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ బలరాం

ఎంతోమంది తమ వద్ద వైద్యచికిత్సలు జరుపుకొని ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version