తెలంగాణలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం:మంత్రి జగదీష్ రెడ్డి

0
78

భువనగిరిలో మంత్రి జగదీష్ రెడ్డి

చేప పిల్లలు వదులుతున్న మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు..సునీత, ఫైళ్ల శేఖర్ రెడ్డి. జడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తదితరులు


వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి, అంతిమంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి…
ఆరో విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ వృత్తుల అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించారని అందులో భాగంగానే కుంచించుకుపోయిన చెరువులను మిషన కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి, వాటిల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ప్రభుత్వ వీప్ గొంగిడి సునితమహెందర్ రెడ్డి, ఎమ్మెల్సీ క్రిష్ణారెడ్డి కలెక్టర్ పమేల సత్పతి, భువనగిరి లోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన పిదప భువనగిరి పట్టణంలో నూతన గ్రంధాలయ భవన నిర్మాణం కి శంకుస్థాపన చేసినmla చిరుమర్తి లింగయ్య,,
mlc కృష్ణా రెడ్డి,zp చైర్మన్ సందీప్ రెడ్డి…రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేంధర్ గౌడ్రై రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరెందర్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ ఛైర్మన్ చింతల కిష్టయ్య, వ్యవసాయ కమిటీ ఛైర్మన్ నల్లమాస రమేష్ గౌడ్,,,PACS చైర్మన్ పరమేష్ ,,mpp , zptc లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.