సెన్సెస్ లో బీసీ కుల గణన జరగకపొతే సెన్సెస్ ని బాయ్ కాట్ చేద్దాం: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ పిలుపు

0
31

ప్రాణం లేని వస్తువులని కూడా సెన్సెస్ లో లెక్కపెడుతున్న బిజెపి ప్రభుత్వం ప్రాణం వుండి జీవశ్చవాలుగా బ్రతుకుతున్న బీసీలని ఎందుకు లెక్కపెట్టదు ?

తెలంగాణలో 144కులాలు వుంటే దాదాపు 130 కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. బిసీలకు సమాజంలో దొరుకుతున్న ప్రాధాన్యత చూస్తే అసలు ప్రజాస్వామ్యంలో వున్నామా ? అనే అనుమానం కలుగుతుంది.

1931లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కుల గణన చేసింది. నేడు డాటాని లెక్కగట్టడానికి అడ్వాన్స్ టూల్స్ అండ్ టెక్నాలజీలు వచ్చాయి. కానీ నాడు బ్రిటష్ వారికి వున్న సోయి నేడు బిజెపికి ఎందుకు లేదు ?


”సెన్సెస్ లో బీసీ కుల గణన జరగకపొతే దేశవ్యాప్తంగా బీసీలంతా సెన్సెస్ ని బహిష్కరించాలి”అని పిలుపునిచ్చారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు. ప్రాణం లేని వస్తువులని కూడా సెన్సెస్ లో లెక్కపెడుతున్న బిజెపి ప్రభుత్వం ప్రాణం వుండి జీవశ్చవాలుగా బ్రతుకుతున్న బీసీలని ఎందుకు లెక్కపెట్టదు” అని ప్రశ్నించారు. బీసీ కుల గణన అభివృద్ధి – సాధికారత అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు దాసోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెన్సెస్ లో ఓబీసీ కాలమ్ చేర్చుతామని 2014లో వాగ్ధానం చేసిన బిజెపి ప్రభుత్వం ఇచ్చిన మాటని తప్పి మోసం చేసింది” అని మండిపడ్డారు.

”బీసీలు నేడు బానిస బ్రతుకులు బదుకుతున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధి ఇలా అనేక రంగాల్లో వివక్షకు గురౌతున్నారు. బిసీలు, ఎంబీసిలు, సంచార జాతులు .. దళితుల కంటే అత్యంత దారుణమైన బతుకులు బతుకుతున్నారు. అసలు ఈ దేశంలో బీసీలు పౌరులేనా ? సమాజంలో అంతర్భగమేనా ? అనే రీతిలో ఇవాల్టికి ఊరికి దూరంగా బతుకుతున్నారు. 144కులాలు తెలంగాణలో వుంటే దాదాపు 130 కులాలకు ఇంతవరకూ ఆదిపత్యం లభించలేదు. వారికి రాజకీయ ప్రాతినిధ్యం లేదు. బిసీలకు సమాజంలో దొరుకుతున్న ప్రాధాన్యత చూస్తే అసలు ప్రజాస్వామ్యంలో వున్నామా ? అనే అనుమానం కలుగుతుంది” అని పేర్కొన్నారు దాసోజు శ్రావణ్.

”మానవ వనరుల అభివృద్ధికి మొదటి కొలమానం డాటా. డాటా లేకపోతే గుడ్డి ఎద్దు చేలో పడినట్లే. ఎంత మంది వున్నారో తెలిస్తేనే ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. నిజంగా బీసీల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే బీసీలు ఎంతో లెక్కలు తేల్చాలి. లెక్కలు తేల్చడానికి కూడా సిద్ధంగా లేని ప్రభుత్వాలు బీసీలు ఏం అభివృద్ధి చేస్తాయి ? అంత కీలకమైన డాటా బిజెపి ప్రభుత్వం ఎందుకు లెక్కగట్టడం లేదు ? 1931లో బ్రిటీష్ ప్రభుత్వం బీసీ కుల గణన చేసింది. నేడు డాటాని లెక్కగట్టడానికి అడ్వాన్స్ టూల్స్ అండ్ టెక్నాలజీలు వచ్చాయి. కానీ నాడు బ్రిటష్ వారికి వున్న సోయి నేడు బిజెపికి ఎందుకు లేదు ? అని ప్రశ్నించారు దాసోజు.

”బీసీలని ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు. వెయ్యి రూపాయిలు, ఒక మందు బాటిల్, ఒక గొర్రె, ఒక ఇస్త్రీ పెట్టెతో బీసిల ఓట్లు కొనుక్కోవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం వుంది. బీసీలు ఆలోచన చేసుకుకోవాలి. ఒకరు ఇవ్వడం ఎందుకు ? మనం బిచ్చగాళ్ళం కాదు. ఓటుని ఒక ఆయుధంగా మలచుకొని చట్ట సభల్లోకి వెళితే బానిసలుగా కాకుండా న్యాయంగా మన హకుల్ని మనం సాధించగలం.” అని పేర్కొన్నారు.

ఈ అఖిల పక్ష సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయష్కిగౌడ్, మాజీ మంత్రి పొన్నాల, లక్ష్మయ్య, మెట్టు సాయి కుమార్ శ్రీకాంత్ గౌడ్.. పలువురుకాంగ్రెస్ నేతలతో పాటు ప్రో. కోదండరామ్, చెరుకు సుధాకర్, పలు పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.