
ఎస్వీఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్ 2022 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం10 గంటలకు ప్రారంభమవుతుందని స్కూల్ ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి తెలిపారు. దేవస్థానం ఉప ప్రధానార్చకులు కాండూరీ వెంకటాచార్యులు, ప్రముఖ వైదులు డాక్టర్ ఎం. గిరిధర్, మాజీ ఎంఇఓ ఎం.మోహనాచార్యులు, కరస్పాండెంట్ గొట్టిపర్తి భాస్కర్ లు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులకు కొత్త సంవత్సరం పొడవునా శుభం చేకూరాలని కోరుతూ నాలెడ్జి మస్తీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే కవి సమ్మేళనం లో విద్యార్థులతల్లిదండ్రులు కూడా పాల్గొనాలని ఆమె కోరారు.ప్రతి విద్యార్థికి కొత్త క్యాలెండర్ ఉచితంగా అందజేస్తామని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.