ఎంపీపీ,ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన సీఎం కేసీఆర్: ఎంపీపీ ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చీర శ్రీశైలం

0
159

సీఎం కేసీఆర్ ఎంపీపీ లను ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆరోపించారు. ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చీర శ్రీశైలం అన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబార్ ఆదేశానుసారం ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించి ఎంపీపీలు, ఎంపీటీసీ లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చీర శ్రీశైలం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంపీపీ లను ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆరోపించారు.

మాట్లాడుతున్న ఎంపీపీ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చీర శ్రీశైలం… వలిగొండ ఎంపీపీ నూతి రమేష్, కల్పన తదితరులు

స్థానిక సంస్థలను నీరుగార్చారని ఆవేదన వ్యక్తంచేశారు.ఎంపీపీ లు మరియు వైస్ ఎంపీపీ లు మరియు ఎంపీటీసీలు పంచాయతీ రాజ్ వ్యవస్థ లో గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు అత్యంత కీలకమైన మండల పరిషత్ సభ్యులుగా ఎన్నికై నేటికి రెండు సంవత్సరాలు గడిచిన ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారని చెప్పారు. కనీసం ఎంపీటీసీలకు రావాల్సిన బాధ్యతలను హక్కులను, విధులను, అధికారలను బదలయించ వలసిందిగా కోరారు. జిల్లా ఎంపీపీ ల సంఘం అధ్యక్షులు నూతి రమేష్ రాజు , ఎంపీటీసీల అధ్యక్షులు కల్పనా శ్రీనివాస్ లు మాట్లాడుతూ సంవత్సరాలు గడిచినా ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారననారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి కి మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాల ఎంపీపీ లు మరియు వైస్ ఎంపీపీ లు మరియు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

మాట్లాడుతున్న ఎంపీపీ ల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చీర శ్రీశైలం