కేసిఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. ఆలేరు కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల అయిలయ్య

0
86

రాష్ట్రంలో కేసిఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఆలేరు కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట నుంచి పీఏసీఎస్ డైరెక్టర్ టిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు యనమల ఎలంధర్ రెడ్డి టిఆర్ఎస్ కు రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో 500 మంది కార్యకర్తలతో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజనులు దళితులు, ఒంటరి మహిళలు, వికలాంగులు అన్ని కులాల వారు మోసపోయారని చెప్పారు. టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. గజ్వేల్ లో జరిగే దళిత దండోర కు ఆలేరు నుంచి వేలాది మంది తరలి రానున్నారు చెప్పారు 500 బైకులు 500 వాహనాలలో తరలి వెళ్తున్నట్లు వెల్లడించారు.

మాట్లాడుతున్న బీర్ల అయిలయ్య.

మాసాయిపేట నుంచి వలసలు ప్రారంభం
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 500 మందితో కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు, పీఏసీఎస్ డైరెక్టర్ యేమల ఎలేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య. మండల పార్టీ అధ్యక్షులు కానుగు, బాలరాజు గౌడ్ యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం తదితర గ్రామ శాఖ అధ్యక్షులు కో-ఆప్షన్ సభ్యులు యాకూబ్, కార్యకర్తలు పాల్గొన్నారు.