కొండపై వర్తకులకు అండగా అఖిలపక్షం నేతలు

0
194

వర్తకుల కోరిక సమంజసమంటున్న జనం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కొండపైన వర్తకులు తమకు కొండపైన దుకాణాలు కేటాయించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు వర్తకులను కలిసి సంఘీభావం ప్రకటిస్తున్నారు. సంఘం అధ్యక్షులు కర్రె వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి తడ్క వెంకటేష్, కొన్నే రమేష్, సంతోష్ రెడ్డిలు ఏర్పాట్లు చూస్తున్నారు.

సంఘీభావం తెలిపిన బీర్ల

రిలే నిరాహర దీక్ష చేస్తున్న కొండ పైన దుకాణదారులకు మద్దతు తెలియజేసిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య.ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి కొండపైన దుకాణాదారులకు ప్రగతి భవన్ లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని,కొండపైనే దుకాణాలు నిర్మించి దుకాణాదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుకాణాదారులకూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేకుంటే పెద్ద ఎత్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతామని అన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో…
యాదాద్రి అభివృద్ధి లో భాగంగా కొండపైన తొలగించిన దుఖానాల సముదాయాలను తిరిగి పునర్నిర్మాణం చేసి వారికే కేటాయించి… గౌరవ ముఖ్యమంత్రి గారి హామీని నిలబెట్టుకోవాలని చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న శిబిరం వద్దకి భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్ట శాఖ ప్రధాన కార్యదర్శి బెలిదే అశోక్ అద్వర్యంలో వారికి సంఘీభావం తెలపడం జరిగింది.ఈ సందర్భంగా బెలిదే అశోక్ మాట్లాడుతూ ప్రత్యక్షంగా 150 మంది పరోక్షంగా 1000 మంది ఆధారపడి ఉన్నందున ముఖ్యమంత్రి గారి గత హామీ ప్రకారంగా షాప్ లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు మొదలైనప్పటి 110 షాప్ లకి గాను 10 షాప్ లు మాత్రమే ఏర్పాటు చేసుకొని కరోనా సమయంలో కూడా ఇట్టి 10 షాప్ లకి 16 లక్షల రూపాయల చొప్పున కట్టి సహకరించారని కావున వారికి తిరిగి షాప్ లు నిర్మించి ఇవ్వాలని తెలియజేసారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రచ్చ శ్రీనివాస్,సత్యం,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు