చిన్నారి చైత్రను చంపిన హంతకుడు రాజు ఆత్మహత్య. ట్వీట్ చేసిన కేటీఆర్

0
243

ఆరేళ్ల చిన్నారి అత్యాచార నిందితుడి మృతదేహం లభ్యం:

చేతిపై ఉన్న పచ్చ బొట్టు గుర్తుతో గుర్తించిన పోలీసులు

హైదరాబాద్‌‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటు చేసుకున్న ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు మృతదేహం లభ్యమైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ శివార్లలోని నష్కల్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు ఆ మృతదేహం నిందితుడు రాజుదేనని నిర్ధారించినట్లు తెలుస్తోంది.

రాజు మృతదేహాన్ని తరలిస్తున్న పోలీసులు…

నిందితుడి కుడిచేతి మీద మౌనిక అనే పేరును టాటూగా ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీనితో మృతదేహం రాజుదేననే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కాగా- రైల్వే ట్రాక్ పక్కన అతని మృతదేహం లభించడంతో.. ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్టేషన్ ఘన్పూర్ వద్ద రైల్వే ట్రాక్ పై లభించిన చైత్ర హంతకుడు రాజు మృతదేహం పరిశీలిస్తున్న పోలీసులు

*హైద‌రాబాద్: సైదాబాద్ చిన్నారి హ‌త్యాచార నిందితుడు ప‌ల్ల‌కొండ రాజు మృతిపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు మృత‌దేహం ల‌భ్య‌మైన‌ట్లు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి చెప్పిన‌ట్లు కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

చైత్ర‌కు న్యాయం జ‌రిగిందంటూ #JusticeForChaithra యాష్‌ట్యాగ్‌ను కూడా కేటీఆర్ త‌న‌ ట్వీట్‌లో పోస్టు *చేశారు* .*