యాదాద్రి భువనగిరి,జనవరి 16 (రోమింగ్ న్యూస్)
రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువడింది. కరోనా కేసుల దృష్ట్యా సెలవులను పొడిగిస్తున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఆదివారం ప్రకటించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. దీంతో జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.