దేశ నాయకుల వేష ధారణలో SVN విద్యార్థుల హల్చల్…!!SVN లో ఆకట్టుకున్న చిల్డ్రెన్స్ డే వేడుకలు

0
570
దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు

ఎస్ వీ ఎన్ రెసిడెన్షియల్
హైస్కూల్ లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ సోమవారం గ్రాండ్ గా జరిగాయి. విద్యార్థులు ఆడి పాడి తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు.

సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్న విద్యార్థులు.

కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు చేసిన ప్రదర్శనలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. దేశభక్తితో పాటు వినోదాత్మక మైనటువంటి అనేక ప్రదర్శనలను విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించారు. ఏకదంతాయ అంటూ ప్రారంభించి అనేక ఫోక్ సాంగ్స్ పై నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ వీ ఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ

i

విద్యార్థిని విద్యార్థులు కో కరిక్యులర్ ఆక్టివిటీస్ లో కూడా రాణిస్తున్నారని ప్రశంసించారు. నేటి పోటీ ప్రపంచంలో మార్కుల తో పాటు అనేక రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటున్నారన్నారు. కంప్యూటర్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందని దాంతో పోటీ అనివార్యమైంది అని చెప్పారు.

నెహ్రూజీ వేషధారణలో ఆకట్టుకున్న శశాంక్

కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ తమలోని ప్రతిభను చాటుతూ సత్తాను ప్రదర్శించాలని విద్యార్థి లోకానికి ఆయన పిలుపునిచ్చారు.

దేశ నాయకులు…పోలీసు వేష ధారణతో చిన్నారులు

ఈ సందర్భంగా దేశనాయకుల వేషధారణ, ఆర్మీ, పోలీసులు, భారతమాత, తెలంగాణ తల్లి తదితరుల వేషధారణలో విద్యార్థులు అదరగొట్టారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు చేసిన సంప్రదాయ ఫ్యాషన్ షో ఎంతో అలరించింది.

లాల్చీ…ధోవతి ధరించి తెలంగాణ సంప్రదాయం చాటి….

విద్యార్థులు దోతి లాల్చీ ధరించి విద్యార్థులు ఎంతో హుందాగా తమ మోడెర్నిటీని చాటుకున్నారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ గొట్టిపర్తి మాధురి, ప్రోగ్రామ్ ఇంచార్జి జగిని హరీష్, సీనియర్ ఉపాధ్యాయులు ఎండి యూసుఫ్, గీత, శ్రీధర్, సాయి, సాహితీ, రజిని, నిఖిత, సరళ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.