బెడిసి కొట్టిన గులాబీ దళపతి వ్యూహం”…

0
342

“టీఆర్ఎస్ ఓటమి పోస్ట్ మార్టం రెఢీ”👇

“అసలెవరీ ఈటల”…

మోదీజీ ని కలవడమే కొంప ముంచిందా…???

అడవి నుంచి తెలంగాణ ఉద్యమ బాట పట్టాడు ఈటల రాజేందర్.పార్టీ పుట్టుక నుంచి కేసీఆర్ వెంటే నడిచాడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణ వాదం వినిపించాడు. అప్పటి సీఎం వై.ఎస్ నుంచి ఎన్నో అవమానాలు భరించాడు.వై.ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉప ఎన్నికల్లో విజయం సాధించాడు. ఒత్తిడిలోనూ ప్రత్యర్థులను చిత్తు చేసాడు.సరే…ఉద్యమాల ఫలితంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.ఉద్యమ పార్టీ…అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది.రాను రాను ఉద్యమ కారులకు గౌరవం తగ్గింది.
చివరకు ఈటలను పార్టీ నుంచి గెంటేసే దాకా వెల్లింది.

“బెడిసి కొట్టిన బాస్ వ్యూహం”…

అన్ని సమయాల్లో డబ్బు,పథకాలు పనిచేస్తాయను కోవడం కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పయ్యింది.ఆ ప్రయోగంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించి….ఉద్యమ కారుల ఉనికి లేదని చాటిచెప్పే బాస్ వ్యూహం ఘోరంగా బెడిసి కొట్టింది.పథకాల గాలం వేసేందుకు టీఆర్ఎస్, ప్రతీకారం తీర్చుకునేందుకు హుజురాబాద్ జనం సిద్దమయ్యారు.అంతలోనే ఆ సమయం రానే వచ్చింది.

ఈటెల విజయ దరహాసం…

“ఆది నుంచి జనంలో కొండంత చైతన్యం”….

వాస్థవానికి హుజూరాబాద్ అంటే ఈటల… ఈటల అంటేనే హుజురాబాద్ అన్న స్థాయిలో రాజకీయాలు నడిచేవిక్కడ.తెలంగాణ వాదం పెద్దగా లేని సమయంలోనే సత్తా చాటారు ఈటల.చైతన్యం ఎక్కువగా ఉండే హుజురాబాద్ లో ఈటలకు ఓటమి రుచి తెలియదు.అంతలా ఈటలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు హుజురాబాద్ జనం.ఈటల కూడా అదే స్థాయిలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.ఇదే ఈటలకు మొదటి అడ్వాంటేజ్.హుజూరాబాద్ ప్రజల టాస్క్,టార్గెట్ ఒక్కటే.అంతా ఈటల బాటలో వెళ్ళాలనే భావన.ఉప ఎన్నికను అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య జరిగే యద్దంలా చూడాలనే సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చింది.ఈ పరిణామం ఈటలకు ఎంతగానో కలిసొచ్చింది.

కొంప ముంచిన “దళిత బంధు”…

ఉప ఎన్నికల్లో బలి పశువు గెల్లి శ్రీనివాస్

దళిత బంధు అనే పథకం నిజంగా ప్రయోగాత్మకమే.ఉప ఎన్నిక ముందే ఈ పథకాన్ని తీసుకు రావడం,వ్యూహంలో భాగమేననేది ఓపెన్ సీక్రెట్. మరి బీసీల్లో,ఓసీల్లో,ఎస్టీలో పేదలు లేరా. వారిపై ఎందుకంత చిన్న చూపు.సరిగ్గా ఎఫెక్ట్ అన్ని కులాలపై పడింది.అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా డ్యామేజ్ అయ్యిందని ఒప్పుకున్నారు కూడా. నిజంగా 40 వేల ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ…..మిగితా కులపు ఓట్లపై పెను ప్రభావం పడింది.ఇక్కడే పప్పులో కాలేశాడు బాస్.

“పార్టీ చేరికలతో మరింత సానుభూతి”…..

హుజురాబాద్ లో ఈటలను ఒంటరి చేయాలి.కేడర్ ను డిస్టప్ చేయాలి.నేతలకు,కార్యకర్తలకు గాలం వేయాలి.నయానో,బయానో ఇచ్చి వారిని కొనేయాలి.మొత్తంగా ఈటల ఇమేజ్ డ్యామేజ్ చేయాలి. ఈ వ్యూహం వర్కవుట్ అయితే టీఆర్ఎస్ గెలువు తధ్యమే.ఆ ప్రయోగం మొదలు పెట్టనే పెట్టారు టీఆర్ఎస్ శ్రేణులు.కనబడ్డోనికల్లా కండువా కప్పారు.కొందరు ఈటల అనుచరులనూ కొనేసారు.ఆ హడావిడిలో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు.డబ్బుతో టీఆర్ఎస్ నాయకులనైతే కొనేస్తే… ఈ పరిణామంతో ప్రజల మనసు గెలిచారు ఈటల.ఇక ఈటల వెంట మేమున్నాం అంటూ అండగా నిలబడ్డారు జనం….

ఈ హెచ్చరికలే….ఈటలను గెలిపించాయా….

” గాడి తప్పిన ప్రలోభాలు”…..

దేశం మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే దృష్టి సారింది.హుజురాబాద్ ఉప ఎన్నికను కాస్లీ ఎన్నికగా పరిగణించారు కొందరు మేధావులు.ఓటుకు ఆరు వేలు అన్న ప్రచారం అక్కడ ఊపందుకుంది. టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని కొందరి మాట.సందట్లో సడెమియా అన్నట్టు…నొక్కినోడికి నొక్కినంత అన్నట్టు టీఆర్ఎస్ శ్రేణుల చేతివాటం ఆ పార్టీకి పెద్ద డ్యామేజ్ అయ్యింది.కొందరైతే ఓటుకు నోటు కోసం రోడ్లపైకొచ్చి ఆందోళనలే చేయడంతో రచ్చకు దారి తీసింది.ఆ డ్యామేజ్ నుంచి గట్టేందుకు ప్రలోభాలు నిలివేశారని హుజురాబాద్ లో టాక్.ప్రలోభ పరిణామం సైతం టీఆర్ఎస్ ఓటమికి బాటలు వేశాయని విశ్లేషకుల మాట.

ఇదెట్లా….ఎలాంటి కలయిక ఇదీ…?? అని ప్రశ్నించిన హుజురాబాద్ ప్రజలు….

“శత్రువులు మిత్రులయ్యారా”…

ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే ఒక్కోసారి శత్రువులను మిత్రులుగా చేసుకోవాలి.బీజేపీ కూడా ఇదే ఫిలాసఫీని ఫాలో అయ్యింధనే టాక్ వినబడుతోంది.ఇందులో రేవంత్ పాత్ర ఉందని కేటీఆర్ లాంటి నాయకుడు పదే పదే వెల్లడించాడు. ఇందులో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే,కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ గెలుపుకు చేయి వేసిందనే చెప్పాలి.వాస్తవానికి కాంగ్రేస్ పార్టీ డిపాజిట్ కోల్పోయే స్థితిలో ఎక్కడా ఉండదు.గ్రామ గ్రామాన ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉంటుంది.ఎంత డమ్మీ క్యా౦డేడ్ నిలబడ్డా మినిమం 30 వేల ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో ఉంటాయి.అందుకే కాంగ్రెస్ గేర్ మార్చింది.టీఆర్ఎస్ ఓటమి చెందాలంటే,కాంగ్రెస్ దూకుడు తగ్గించాలి.ఎందుకంటే ఓట్లు చీలితే అది టీఆర్ఎస్ పార్టీకే అడ్వా౦టేజ్ కనుక.అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇదే విషయాన్ని దృవీకరించాడు.మేం వెనక్కి తగ్గా౦ కాబట్టే ఈటల విజయం సాదించాడని కుండ బద్దలు కొట్తినట్టు చెప్పాడు.మొత్తానికి ఈటల విజయానికి,టీఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ చెయ్యి వేసిందని మేధావుల మాట కూడా…

కొంప ముంచిన అపవిత్ర కలయిక

“రేపు మన పరిస్థితి కూడా అంతేనా”…

ఈటల లాంటి నేతనే పార్టీలో కరివే పాకయ్యాడు.అలాంటిది రేపు మనం కూడా గడ్డిపోచలు కాలేమా అన్నది మంత్రులు,అధికార పార్టీ ఎమ్మెల్యేల భావన.ఒకవేళ ఈటల గెలిస్తే పార్టీలో కాస్తో కూస్తో విలువ.లేదంటే ఈటలను తీసి పారేసినట్టు రేపు మన గతి కూడా అంతే.ఇది లోలోపల అధికార పార్టీ నేతల లోగుట్టు.అందుకే డబ్బు పంపకాలు,మొక్కుబడిగా చేసిన ప్రచారాలు ఈటలకు ప్లెస్ అయ్యాయి.

మొత్తానికి కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్టు…టీఆర్ఎస్ ఓటమికి ఇలాంటి ఈక్వేషన్స్ తోడయ్యాయి.ఇందులో నీతి ఏంటంటే అణచివేత మొదలతే తిరుగుబాటు తీవ్రతరమవుతది.పిల్లి కూడా పులి అవుతది.ఓటర్ల చైతన్యం రుచి చూపెట్టాల్సి వస్తది.అందుకే పెద్దలు ఊరికే అనలేదు. రాజకీయ నాయకుడు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనీ.