మరో కార్మికుడు లక్ష్మణ్ దవాఖానకు తరలింపు
యాదగిరిగుట్ట మండలం రామాజీపేట ఆవాసగ్రామం ఆహ్మద్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన
పిట్టల పద్మ(40), డేగల లక్ష్మణ్ ఇద్దరూ పెద్ద కందుకూరు లోని ప్రీమియర్ ఎక్స్ప్లోజి వ్ప రిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. రోజువారి దిన చర్య లో భాగంగా డ్యూటీ ముగించుకుని ద్విచక్ర వాహనం పైన వంగపల్లి వైపుకు వస్తున్నారు. ఈ క్రమంలో అహ్మద్నగర్ దాటిన తర్వాత వంగపల్లి వైపుకు తిరుగుతుండగా వెనక నుంచి వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. పద్మ తీవ్రంగా గాయపడటంతో భువనగిరి లోని జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. లక్ష్మణ్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై యాదగిరిగుట్ట ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.