రోమింగ్ న్యూస్ కు ప్రజాదరణ: గొంగిడి సునిత మహేందర్ రెడ్డి

0
276
యాదాద్రిలో క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.గడ్డమీడి రవీందర్ గౌడ్, కర్రె వెంకటయ్య,, మిట్ట వెంకటయ్య తదితరులు.

నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ గొట్టిపర్తి భాస్కర్ అని కొనియాడిన గొంగిడి మహేందర్ రెడ్డి

సీనియర్ జర్నలిస్టు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన రోమింగ్ న్యూస్ తెలుగు దిన పత్రిక అత్యంత ప్రజాదరణ పొందుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఆకాంక్షించారు. రోమింగ్ న్యూస్ తెలుగు దిన పత్రిక 2022 క్యాలెండర్ ను డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారితో కలిసి వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా వైపుకు నాయకులు అడుగులు వేసే విధంగా పత్రిక తన వార్తలను ప్రచురించి చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాధరణ పొందిన వార్తలు రాయడములో గొట్టిపర్తి భాస్కర్ కు ఎంతో అనుభవం ఉన్నదని చెప్పారు. ఎన్నో సంచలన కథనాలను రాసి 30 ఏళ్లలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన విషయాన్ని ఉదహరించారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ నిబద్దత కలిగిన జర్నలిస్టుగా… తెలంగాణ ఉద్యమ కారునిగా గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ 30 ఏళ్లలో అనేక సంచలన కథనాలు వెలువరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ,యాదగిరిగుట్ట టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య , ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య గౌడ్, రాజపేట పీఏ సీ ఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ,మహేంద్ర యువసేన నాయకులు మిట్ట అనిల్ గౌడ్,ఆలేరు సింగిల్ విండో ఛైర్మన్ మొగులగాని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.