వచ్చే ఎన్నికల్లో.. తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదే. ఆలేరు కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డి ఆలేరులో బీర్ల అయిలయ్య చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు భేష్: రేవంత్ రెడ్డి

0
491
బీర్ల అయిలయ్య నేతృత్వంలో టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన ఆలేరు కాంగ్రెస్ నాయకులు…గుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, గుట్ట మండల శాఖ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్.

ఆలేరు నియోజకవర్గ ప్రతినిధి. సెప్టెంబర్ 11.

వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆలేరు కాంగ్రెస్ ఇంచార్జి బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం తదితరులు హైదరాబాద్ లోని రేవంత్ నివాసంలో కలిసి శ్రీ లక్షీ నరసింహుని ప్రసాదం అందజేసిన మీదట ఆయనతో ఆలేరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డికి వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని వివరిస్తుండగా రేవంత్ కూడా తమకు ఆలేరులో గెలుస్తామనే నమ్మకం కుదిరిందని తాము తెప్పించుకున్న రిపోర్టులు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పడంతో గుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు తాము ప్రస్తుత ఎమ్మెల్యే గొంగిడి సునీత గ్రామానికి చెందిన వ్యక్తినని ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ సర్పంచి పదవిని, ఎంపీపీ పదవిని, ఆలేరు లో జడ్పీటీసీ తదితర పదవులను గెల్చుకున్నామని వివరించారు. యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం మాట్లాడుతూ తాము టీఆరెస్ ను ఎదుర్కొని ఎన్నో కష్టాలు పడుతున్నామని చెప్పారు. ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి బీర్ల అయిలయ్య ఆలేరులోని ప్రతి పల్లెలో పట్టు సాధించారని చెప్పారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి బీర్ల అయిలయ్య ఆలేరు నియోజకవర్గంలో రూ. కోట్లు ఖర్చు చేసి అనేక సమస్యలు పరిష్కరిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు .రేవంత్రెడ్డి దృష్టికి తెచ్చారు. తనకున్న దాంట్లో రూపాయి సంపాదిస్తే దానిలో యాభై పైసలు ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నట్లు అయిలయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి బీర్ల ఆయిలయ్యాను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాజాపేట మహేందర్ గౌడ్, విద్యార్థి, యువజన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన ఆలేరు నేతలు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆలేరు కాంగ్రెస్ నేతలు బీర్ల అయిలయ్య నేతృత్వంలో కలిసి ఆలేరు నియోజకవర్గంలో చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తుర్కపల్లి మండలంలోని తండాలో జరిగిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపునిచ్చిందని వారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అయిలయ్య గట్టిగా పనిగట్టుకుని పనిచేస్తున్నాడని ప్రశంసించారు.