వాటర్ వర్క్స్ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలి: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్

0
64

వాటర్ వర్క్స్, సివరేజ్ వుద్యోగుల సేవలు వెలకట్ట లేనివి. వారు ఆరోగ్య భద్రత కార్మికులు. అలాంటి మహత్తరమైన పని చేసే ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వడం కోసం ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతుంది ?

1658 ఉద్యోగాలు ఖాళీలు వున్నాయి. వెంటనే వాటి భర్తీ చేసి శ్రమ దోపిడీకి గురౌతున్న ఉద్యోగాలను ఆ దోపిడీ నుంచి కాపాడి , నిరుద్యోగ సమస్యని కూడా తీర్చాలి. ఉద్యోగాలకు ఇచ్చిన హెల్త్ కార్డ్ లో నిమ్స్ హాస్పిటల్ ని కూడా చేర్చాలి.

కర్తవ్య నిర్వహణలో బాగమై ప్రజల మురుగుని ఎత్తిన 23మంది వాటర్ వర్క్స్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన కార్మికల కుటుంబాలకు వెంటనే 25లక్షల రూపాయిల ఎక్స్ గ్రేషియా చెల్లించి, అర్హులైన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలి.


”ఈ ఏడాది జూన్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చారు. మరి ఏం పాపం చేశారాని వాటర్ వర్క్స్ లో పని చేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదు” అని నిలదీశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. కోటి మంది నీటి అవసరాలు తీరుస్తున్న వాటర్ వర్క్స్ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలనీ కోరుతూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరైన సత్యనారాయణ, డైరెక్టర్ పర్శనల్ శ్రీధర్ బాబుని కలసి వినతి పత్రం అందించారు దాసోజు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.

వాటర్ వర్క్స్, సివరేజ్ వుద్యోగుల సేవలు వెలకట్ట లేనివి. వారు ఒక్క పూట పని ఆపస్తే నగరంలో తాగడానికి మంచి నీళ్ళు దొరకవు, ఎక్కడిక్కడ మరుగు నీరు నిలిచిపోతుంది. వారు ఆరోగ్య భద్రత కార్మికులు. అలాంటి మహత్తరమైన పని చేసే ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వడం కోసం ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు ? అని ప్రశ్నించారు దాసోజు. అనవసరమైన భేషజాలాకు పోకుండా వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఉద్యోగాలకు ఇచ్చిన హెల్త్ కార్డ్ లో నిమ్స్ హాస్పిటల్ ని కూడా చేర్చాలని కోరారు. 1658 ఉద్యోగాలు ఖాళీలు వున్నాయి. వెంటనే వాటి భర్తీ చేసి శ్రమ దోపిడీకి గురౌతున్న ఉద్యోగాలను ఆ దోపిడీ నుంచి కాపాడి , నిరుద్యోగ సమస్యని కూడా తీర్చాలని కోరారు. లాక్ డౌన్ లో అందరూ ఇంట్లో వుంటే కర్తవ్య నిర్వహణలో బాగమై ప్రజల మురుగుని ఎత్తిన 23మంది కార్మికులు చనిపోయారని స్వయంగా డైరెక్టర్ అఫ్ పర్శనల్ ప్రకటించారు. చనిపోయిన కార్మికల కుటుంబాలకు వెంటనే 25లక్షల రూపాయిల ఎక్స్ గ్రేషియా చెల్లించి, అర్హులైన వారి కుటుంబ సభ్యులకు వాటర్ వర్క్స్ లో ఉద్యోగం కల్పించాలి”అని డిమాండ్ చేశారు దాసోజు.