స్కూల్ బస్సుల రోడ్ టాక్స్ మినహాయించాలి….. ……….ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు వినతి

0
274

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కు వినతిపత్రం అందజేస్తున్న శేఖర్ రావు ఇతర నాయకులు

కరోనా మొదటి దశ ప్రారంభమైన మార్చి 16, 2020 నుండి ఆగస్టు 30 2021 వరకు పాఠశాలలు మూసివేయడం వలన ప్రైవేటు స్కూల్ బస్సులు ఒక్కటి కూడా వినియోగంలో లేవని మరియు ఈ కాలానికి ఒక్క బస్సు కూడా విద్యార్థులతో రోడ్డుపై తిరిగలేదు కనుక, 1958 మోటార్ వాహన చట్టం, క్లాజ్ 3.3 అనుసరించి వాహనాలు వినియోగంలో లేని కాలానికి రోడ్ టాక్స్ లు పూర్తిగా మినహాయించాలని ట్రస్మా రాష్ట్ర నాయకత్వం హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ట్రస్మా సంఘం నుండి పూర్తి వివరాలు తీసుకున్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ విషయమై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో మాట్లాడిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ కు బస్సుల రోడ్ టాక్స్ మినహాయింపునకు అనుమతులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వగా అందుకు ట్రస్మా సంఘం తరఫున హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు యాదగిరి శేఖర్ రావు అన్నారు.బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ మరియు అన్ని రకాల పర్మిట్ల పై జారీ చేసిన అనుమతులు సెప్టెంబర్ 30, 2021 పొడగింపపడ్డాయని యాదగిరి శేఖర్ రావు గుర్తు చేస్తూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్య సభ్యులందరూ వారి పాఠశాల బస్సులను నిర్వహణ లోపాలు లేకుండా చూసుకుంటూ, ఇన్సూరెన్స్ చెల్లించి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వినియోగించుకోవాలని , అలానే ట్రస్మా రాష్ట్ర సంఘం ప్రభుత్వంతో రోడ్ టాక్స్ మినహాయింపు కొరకు ప్రయత్నాలు జరుగుతున్నందున స్కూల్ యాజమాన్య సభ్యులు ఎవరు రోడ్ టాక్స్ ప్రస్తుతానికి చెల్లించ వద్దని ఆయన మనవి చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కోరం సంజీవరెడ్డి, హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్, ట్రస్మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాపరెడ్డి, మహిపాల్ రెడ్డి ,రవీందర్ రెడ్డి, రవీందర్, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.