తెలంగాణలో 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని.. నిరూపిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఓటరు నమోదు కార్యక్రమం ఉందని విమర్శించారు. ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందోనని వేచి చూస్తున్నామన్నారు. తాము ఎన్నికల సంఘానికి వ్యతిరేకం కాదని, ఎన్నికల సంఘం సరిగా పనిచేయడం లేదని చెబుతున్నామన్నారు. పంతానికి పోయి ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించిందని, ఈసీ తీరుపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు.
తెలంగాణలో 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని నిరూపిస్తాం: శశిధర్‌రెడ్డి
