హైదరాబాద్ ప్రతినిధి.
గోపా 40వ వనభోజనాల కార్యక్రమం విజయవంతం చేయాలని గోపా అధ్యక్ష, కార్యదర్శులు మద్దెల రమేష్ బాబు గౌడ్, బండి సాయన్న గౌడ్ లు పిలుపునిచ్చారు.

శనివారం స్ఫూర్తి మహిళ డిగ్రీ కళాశాలలో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ గౌడ ఆఫిషియల్స్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 28న సంజీవయ్య పార్కులో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కమిటీలను ఈ సందర్భంగా నియామకం చేశారు. అద్భుతమైన గౌడ్ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని వారు కోరారు. సంజీవయ్య పార్కుకు 28 న ఉదయం 8 గంటల వరకు చేరుకోవాలని చెప్పారు.

సమావేశంలో కోశాధికారి రఘు, ఉపాధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కారుపోతుల పాండరీ,సంయుక్త కార్యదర్శి కుర్మిల శేఖర్, సత్యం, వేణు, సైదులు, యాదయ్య, జాయింట్ సెక్రటరీ కోలా రమేష్ గౌడ్ … పాల్గొన్నారు.

