శ్రీయాదాద్రి ప్రతినిధి : భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆదివారం యాదాద్రి భక్తపరవశంతో పోటెత్తింది. సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో తిరవీధులన్నీ కిటకిటలాడాయి. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్ది క్యూకట్టారు. శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తులు బారులు దీరారు. శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతపూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు, సుదర్శనహోమం తదితర కైంకర్యాలలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ఖజానాకు అన్ని విభాగాల ద్వారా రూ. 9, 42, 617 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.