ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 30 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ మరియు దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
డబ్లిన్‌లో బతుకమ్మ సంబురాలు
