రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు దసరా సెలవులను పొడిగిస్తున్నట్లు ఇంటర్మిడియేట్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 18 వరకు ఉన్న సెలవులను మరో రెండు రోజుల పాటు పొడిగించింది. అక్టోబరు 19, 20వ తేదీల్లో కూడా కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు. ఈ నెల 22న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.