పదవుల కోసం అనైతిక పొత్తులు…కాంగ్రెస్‌పై మండిపడ్డ హరీష్

0
111

సంగారెడ్డిలో తెలంగాణ ద్రోహులకు చోటు లేదని ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి, అవకాశవాద రాజకీయాల మధ్య జరిగే ఎన్నికలివని పేర్కొన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ అనైతిక పొత్తులు పెట్టుకుందని విమర్శించారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్‌ను కోమటిరెడ్డి మూసివేస్తామంటున్నారని…పరాయిపాలన, చీకటి తెలంగాణ నిర్మాణమే కాంగ్రెస్ లక్ష్యమా? అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామని హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు.