బయటపడిన చంద్రబాబు బండారం

0
53

మొత్తానికి మావోయిస్టుల వల్ల చంద్రబాబునాయుడు బండారం బయటపడింది. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి తగ్గట్లే అనేక వ్యూహాలు రచించారు. అందులో ఫిరాయింపులను ప్రోత్సహించటం ఒకటి. కోడలికి బుద్దులు చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెతలాగ తెలంగాణాలో కెసియార్ పై విరుచుకుపడిన చంద్రబాబు ఏపిలో తాను కూడా చివరకు ఫిరాయింపులకే దిగారు. ప్రజాస్వామ్య విలువల గురించి ఏమాత్రం మొహమాటం లేకుండా పాతరేసేశారు. ఎవరి విలువ కొద్ది వారికి కోట్ల రూపాయలు ఖరీదు కట్టిన విషయం మావోయిస్టుల పుణ్యమా అని బయటపడిపోయింది. ఫిరాయింపుల్లో భాగంగా 23 మంది వైసిపి ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను నిసిగ్గుగా టిడిపిలోకి లాగేసుకున్నారు. గాలానికి తగులుకున్న ప్రతీ వైసిపి ఎంఎల్ఏ, ఎంపిలకు ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారితో బేరాలాడేసి లాగేసుకున్నారు. అభివృద్ధిని చూసి వాళ్ళంతట వాళ్ళే తెలుగుదేశంపార్టీలో చేరారంటూ కథలల్లారు. సరే, చంద్రబాబుకు బాకాలూదే మీడియా ఎటూ ఉండనే ఉంది కదా ? చంద్రబాబు చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా మీడియాకు ఏమాత్రం పట్టలేదు.ఫిరాయింపుల్లో నలుగురికి మంత్రి పదవులిచ్చారు. ఫిరాయింపులకు మంత్రిపదవులు ఇవ్వటం రాజ్యాంగ పరంగా నేరంకాదు కానీ అనైతికం. అయినా చంద్రబాబును పల్లెత్తు మాటనలేదెవరు. సరే కొందరికి కోట్ల రూపాయలు ముట్టింది. మరో నలుగురికి మంత్రివర్గంలో చోటు దొరికింది. ఇంకొందరికి అప్పులు తీర్చి కాంట్రాక్టులు కూడా ఇచ్చారట. అలా కోట్ల రూపాయలు అందుకున్న వారిలో పోయిన నెల 23వ తేదీన మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు రూ. 12 కోట్లు అందుకున్నారట.