తాను ఏ పార్టీలోనూ చేరనని, సెక్యులర్ పార్టీల మధ్య వారధిగా ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో గద్దర్, ఆయన కుమారుడు సూర్యకిరణ్ భేటీ అయ్యారు. అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడుతూ తనపై గతంలో జరిగిన దాడిపై విచారణ జరిపిస్తామని రాహుల్ చెప్పారన్నారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుకాలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కొత్త ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తోందన్నారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం బందీఖానాగా మార్చిందని గద్దర్ విమర్శించారు.
ఏ పార్టీలోనూ చేరను: గద్దర్
