పవన్ కల్యాణ్‌పై కత్తి మహేశ్ తీవ్ర విమర్శలు

0
110

ఎవరు డబ్బులు ఇస్తే పవన్ కల్యాణ్ వారికే వత్తాసు పలుకుతాడని కత్తి మహేశ్ అన్నారు. ఎమ్మిగనూరులో మాదిగల రాజకీయ చైతన్యసభలో ఆయన.. పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి పవన్‌కల్యాణ్ ఏజెంట్ అని కత్తి మహేశ్ వ్యాఖ్యానించారు. పవన్‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అతనికే తెలియదన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 500 మంది ఓట్లర్లను కూడా ప్రభావితం చేయలేడని చెప్పారు. మాదిగలు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని కత్తి మహేశ్ పిలుపునిచ్చారు.