తెలంగాణలోని భూపాల్‌పల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది మైనార్టీ నాయకులు మంథని ఎమ్మెల్యే తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో బుధవారం టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మైనార్టీల అభివృద్ధి జరగాలంటే మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని టీఆర్ఎస్‌లో చేరినట్లు మైనార్టీ నాయకులు వెల్లడించారు.
మెదక్‌జిల్లాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
తెలంగాణలోని మెదక్‌జిల్లాలో విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మహబూబ్‌బాద్ జిల్లాలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య
మహబూబ్‌బాద్ జిల్లాలో ఇంటింటి ప్రచారం
తెలంగాణలోని మహబూబ్‌బాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని సీతంపేటలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరుతున్న మున్నూరు కాపు సంఘం సభ్యులు
తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిక
తెలంగాణలోని మహబూబ్‌బాద్ జిల్లా తొర్రూరులో దేవరుప్పల మండలానికి సీతారాంపురం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి మున్నూరు కాపు సంఘంకు చెందిన పలువురు సభ్యులు నల్ల యాదగిరి, ఉప్పల రంగయ్య, సోమయ్య, అంజమ్మ, కృష్ణమూర్తి, భాస్కర్, యాదగిరి, రాము, రుద్రోజు వీరాచారి, భాషపాక కొండయ్య, రతన్, యాదగిరి, గణేష్ తదితరులు తాజా మాజీ ఎమ‌్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్ సుధాకర్‌రావుల సమక్షంలో బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు బీసీల కులవృత్తులకు, బీసీ కులాలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని మున్నూరు కాపు సంఘం సభ్యులు తెలిపారు. పాలకుర్తిని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న నాయకుడు, ఎటువంటి మచ్చలేని నాయకుడు ఎర్రబెల్లి అని, అందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.