తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి కొత్త భయం పట్టుకున్నది. తన ఏకైక ప్రత్యర్థిగా చెప్పుకునే కేసిఆర్ మీద శషబిషలు లేకుండా నిప్పులు చెరిగే స్వభావం ఉన్న రేవంత్ రెడ్డికి ఇంత భయం ఎందుకు పట్టుకున్నది. ఆయన శిబిరంలో ఎందుకు కలవరం రేగుతున్నది? అసలు ఏ విషయంలో రేవంత్ శిబిరం టెన్షన్ పడుతున్నది.తెలంగాణ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా సింగిల్ అజెండాతో పనిచేస్తున్నారు. అదేమంటే కేసిఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం, కేసిఆర్ ఫ్యామిలీ చేస్తున్న మంచి చెడ్డలను జనాలకు వివరించడం. ఆమాటకొస్తే మంచి చెడ్డల కంటే నిత్యం కేసిఆర్ కుటుంబంపై తీవ్రమైన విమర్శలు, అవసరమైతే వ్యక్తిగత తిట్లు తిట్టడం రేవంత్ పనిగా పెట్టుకున్నారు. ఈ విషయంలో ఒకటి రెండుసార్లు మాత్రమే రేవంత్ విమర్శలకు ప్రతి విమర్శలు వచ్చాయి. కానీ మెజార్టీ సమయాల్లో రేవంత్ విమర్శలపై టిఆర్ఎస్ సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకసారి బాల్క సుమన్ రేవంత్ రెడ్డికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. తర్వాత రేవంత్ సై అనగానే పలాయనం చిత్తగించారు. ఇలా కారణాలేమైనా రేవంత్ ను ఎదుర్కోవడంలో టిఆర్ఎస్ ఎక్కువసార్లు విఫలమైందనే చెప్పాలి. తన నోటితో ఇంతగా అధికార పార్టీని కలవరపెడుతూ, టెన్షన్ కు గురిచేస్తూ ఉన్న రేవంత్ రెడ్డికి భయం పట్టుకోవడమేంటి అనుకుంటున్నారా? అవును పెద్ద భయమే ఉంది రేవంత్ కు. అదేమంటే తెలంగాణ రాష్ట్రంలో తన ప్రాణాలకు హాని ఉందని రేవంత్ భయపడుతున్నారు.