జమ్మూకాశ్మీర్‌లోని ఫతేహ్‌హడల్ ప్రాంతంలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం ఉదయం ఈ ఆపరేషన్ నిర్వహించగా.. పోలీసులపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరికొందరు పోలీసులు గాయపడినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ముందు జాగ్రత్తగా అధికారులు ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేసి.. విద్యాసంస్థలను మూసివేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం, పోలీసు మృతి
