భారత్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు భోజన విరామ సమయానికి విండీస్ 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాత్‌వైట్(14), పావెల్(22)తో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ హోప్(36) వికెట్లను ప్రత్యర్థి జట్టు కోల్పోయింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్; కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. 32వ ఓవర్ మూడో బంతికి హోప్ ఎల్బీగా వెనుదిరగడంతో అంపైర్లు భోజన విరామం ప్రకటించారు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.