Site icon Sri Yadadri Vaibhavam

Ambati Rayudu.. ఛేజింగ్‌లో కోహ్లి, ధోనీలను దాటేశాడు

Highlights

గత ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున రాణించడంతో అంబటి రాయుడి దశ తిరిగింది. టీమిండియాకు ఎంపికైన ఈ తెలుగు క్రికెటర్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆటగాళ్లను మార్చి ప్రయోగాలు చేస్తున్న కోహ్లి.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో రాయుడు, కుల్దీప్ యాదవ్‌లకు చోటిచ్చాడు. దినేశ్ కార్తీక్ స్థానంలో బరిలో దిగిన రాయుడు ఈ మ్యాచ్‌లో 23 బంతులను ఎదుర్కొని 13 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. 

తద్వారా వన్డే ఫార్మాట్లో విజయవంతంగా లక్ష్యాన్ని చేధించిన మ్యాచ్‌ల్లో ఎక్కువ సగటు ఉన్న బ్యాట్స్‌మెన్‌గా ధోనీ, కోహ్లిలను రాయుడు దాటేశాడు. సక్సెస్‌ఫుల్ ఛేజ్ మ్యాచ్‌ల్లో ధోనీ సంగటు 103.07 ఉండగా.. కోహ్లి యావరేజ్ 96.94గా ఉంది. రస్సెల్ ఆర్నాల్ (91.00), మైకెల్ బేవాన్ (86.25) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా అగ్రస్థానానికి చేరుకున్న రాయుడు సగటు 103.33గా ఉంది. దశాంశాల తేడాతో రాయుడు ధోనీని దాటేశాడన్నమాట. 

జట్టులో బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తున్న కోహ్లి.. ఆటగాళ్లను రొటేట్ చేస్తున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న రాయుడు వరల్డ్ కప్ బెర్త్ కోసం దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌లతో పోటీ పడుతున్నాడు. 

Exit mobile version