హర్మన్‌ప్రీత్ ఆల్‌రౌండ్ షో

0
58

మహిళల టీ20 ఆసియాకప్‌లో భారత జట్టు వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. సోమవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యఛేదనలో థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 66/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(3/11), దీప్తిశర్మ(2/16) ధాటికి థాయ్‌లాండ్ జట్టులో ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. బూచథామ్(21) మినహా అందరూ ఘోరంగా విఫలమై వికెట్లు సమర్పించుకున్నారు. తొలుత మోనా మెశ్రామ్(32), స్మృతి మందన(29), హర్మన్‌ప్రీత్(17 బంతుల్లో 27 నాటౌట్, 3 ఫోర్లు) బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 132/4 స్కోరు చేసింది. ఓపెనర్లు టీమ్‌ఇండియాకు మెరుగైన ఆరంభమివ్వగా, ఆఖర్లో కౌర్ మెరుపులు మెరిపించింది. వరుస బౌండరీలతో థాయ్‌లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. లీంగ్‌ప్రసెర్ట్(2/16)కు రెండు వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.