భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచిన తర్వాత ఆమెకు ప్రతి టోర్నీలోనూ గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ప్రిలిమినరీ పోటీల్లోనే నిష్ర్కమిస్తోంది. తాజాగా డెన్మార్క్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే ఆమె పరాజయం పాలైంది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధూ అమెరికా షట్లర్ బీవెన్ ఝంగ్‌తో జరిగిన పోరులో 17-21, 21-16, 18-21 తేడాతో ఓటమి చవిచూసింది. దాదాపు గంట పాటు వీరిద్దరూ హోరాహోరీగా పోరాడారు. బీవెన్ ఝంగ్ చేతిలో సింధు ఓటమి పాలవ్వడం వరుసగా ఇది మూడోసారి. ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ఓపెన్ ఫైనల్లోనూ ఝంగ్ ఇదే ప్రదర్శన పునరావృతం చేసింది. జపాన్ ఓపెన్ రెండో రౌండ్‌లో సింధుపై గావో ఫంగ్‌జి గెలిచింది. ఇక చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో 11-21, 21-11, 15-21 తేడాతో చెన్ యూఫీ విజయకేతనం ఎగరేసింది.
పీవీ సింధుకు ఊహించని షాక్!
