ఆఫ్ఘన్‌దే టీ20 సిరీస్

0
64

 ఆఫ్ఘనిస్థాన్ అదరగొట్టింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘన్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లా నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. సమీవుల్లా షెన్వారీ(49), మహ్మద్ నబీ(31 నాటౌట్) రాణించారు. మొస్సాదెక్ హుస్సేన్(2/21)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత రషీద్‌ఖాన్(4/12) విజృంభణతో బంగ్లా 20 ఓవర్లలో 134/8 స్కోరు చేసింది.