Site icon Sri Yadadri Vaibhavam

మహిళా క్రికెటర్ల ప్రైజ్‌మనీ మరీ ఘోరం!

భారత పురుష, మహిళా క్రికెటర్ల నగదు ప్రోత్సాహాకాల విషయంలో వైరుధ్యం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఏండ్లు గడుస్తున్నా..మహిళా క్రికెటర్ల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు అంతగా కనిపించడం లేదు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కింద ఒక్కో క్రికెటర్ అక్షరాలా లక్ష రూపాయలు అందుకున్నాడు. ఇక అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన క్రికెటర్లయితే రూ.10 లక్షలతో పాటు పలు ప్రముఖ కంపెనీల ప్రోత్సాహకాలు అదనంగా తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రైజ్‌మనీ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళా క్రికెటర్ల పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది.

ప్రస్తుతం మహిళల ఆసియాకప్ టీ20లో భారత్ తరఫున బరిలోకి దిగి విజయాల్లో కీలకమైన మిథాలీరాజ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ అందుకున్న మొత్తం ఎంతో తెలిస్తే..అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆతిథ్య మలేసియా, థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో జట్టుకు భారీ విజయాలు అందిచడంలో కీలకమైన మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కింద కేవలం రూ.16, 778 ప్రైజ్‌మనీ పొందారు. మహిళా క్రికెటర్ల పట్ల ఐసీసీ వ్యవహరిస్తున్న వివక్షపై సోషల్‌మీడియా వేదికగా అభిమానులు భగ్గుమంటున్నారు. పురుష క్రికెటర్లతో సమానంగా ప్రైజ్‌మనీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version