రెండో టెస్టులో వెస్టిండీస్‌పై భారత్ 10 వికెట్ల తేడాతో విజయం
మళ్లీ.. మూడు రోజులే! వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా మళ్లీ మూడు రోజుల్లోనే విజయ దుందుభి మోగించింది. రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు నిర్దేశించిన 71 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లు 16.1 ఓవర్లలోనే ఛేదించారు. పృథ్వీ షా(33; 45బంతుల్లో 4×4), కేఎల్ రాహుల్(33; 53 బంతుల్లో 1×4, 1×6) చక్కగా ఆడి పది వికెట్ల తేడాతో విజయం అందించారు. షావిన్నింగ్ షాట్ బాదేశాడు. 2-0తో సిరీస్ భారత్ వశమైంది.